- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బైడెన్ అధిక్యంపై ట్రంప్ సంచలన ట్వీట్..

దిశ, వెబ్‌డెస్క్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్న విషయం తెలిసిందే. అయితే, అగ్రరాజ్యానికి కాబోయే తర్వాతి ప్రెసిడెంట్ ఎవరనేది అమెరికా ప్రజలకు ఇప్పటికే క్లారిటీ వచ్చినట్లు ఉంది. ఎందుకంటే కౌంటింగ్ కొనసాగుతున్న జార్జియా, పెన్సిల్వేనియా, నెవాడాలో తదితర రాష్ట్రాల్లో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ ముందు వరుసలో నిలిచారు.అంతేకాకుండా, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ నిలిపివేయాలని ట్రంప్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
ఈ నేపథ్యంలోనే ట్రంప్ జో బైడెన్‌పై ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం ప్రారంభించారు. బైడెన్ తొందరపడి వేడుకలు చేసుకోవద్దని ట్రంప్ శిబిరం ప్రకటించగా.. డెమొక్రటిక్ పార్టీ మోసం చేసి ఎన్నికల్లో గెలవాలని చూస్తోందని ట్రంప్ హాట్ కామెంట్స్ చేశారు. అందువల్లే తొలుత తాము లీడింగ్‌లో ఉన్న రాష్ట్రాల్లో బైడెన్ మళ్లీ ముందుంజలో నిలిచారని వ్యాఖ్యానించారు. కాగా, ట్రంప్ తన ఓటమిని ఇప్పటికీ అంగీకరించం లేని డెమొక్రటిక్ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.