- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిరుపేదలకు బస్తీ దవాఖాన ద్వారా మెరుగైన వైద్యం.. బేతి
దిశ, ఉప్పల్ ; తెలంగాణ ప్రభుత్వం బస్తీ దవాఖాన ద్వారా పేదలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు తగిన చర్యలు తీసుకుంటుందని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గంలోని చిల్కానగర్ డివిజన్ బీరప్పగడ్డలో శుక్రవారం ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను ఎమ్మెల్సీలు సురభి వాణి దేవి , కాటేపల్లి జనార్దన్ రెడ్డి, డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మొత్తం ఉప్పల్ నియోజకవర్గంలో 17 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసుకున్నామని, మరికొన్ని ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు. ప్రభుత్వం పేద ప్రజల పక్షపాతిగా మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకోచ్చిందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
చిలకనగర్ డివిజన్ బీరప్పగడ్డ పేద ప్రజలు ఉండే ప్రాంతం అని ఈ ప్రాంతంలో బస్తీ దవాఖాన ఏర్పాటు చేసినందుకు కేసీఆర్, కేటీఆర్, ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కీసర ఆర్డీవో రవి, ఉప్పల్ ఎమ్మార్వో గౌతమ్ కుమార్, ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ సౌందర్యలత, డిప్యూటీ కమిషనర్ అరుణకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగేందర్ స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.