ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ బిల్లుతో సామాజిక న్యాయం : ఎంపీ రాములు

by Shyam |
TRS MP Ramulu
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ బిల్లుతో సామాజిక న్యాయం ద‌క్కుతుంద‌ని టీఆర్ఎస్ ఎంపీ పోతుగంటి రాములు అన్నారు. లోక్‌సభలో శుక్రవారం జ‌రిగిన‌ చ‌ర్చలో ఎంపీ రాములు మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ, బీ, సీ, డీ వ‌ర్గీక‌ర‌ణ అంశం పెండింగ్‌లో ఉంద‌న్నారు. విద్య, ఉద్యోగాల్లో అవ‌కాశాలు ద‌క్కలేద‌ని ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల చట్టం ప్రకారం.. 2000లో 59 షెడ్యూల్డు కులాలను వర్గీకరించిందన్నారు. 2004 వరకు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు అమలు చేసిందన్నారు. కానీ సుప్రీంకోర్టు ఈ చట్టాన్ని రద్దుచేసి అధ్యయనానికి ఎంక్వైరీ కమిషన్‌ను వేసిందన్నారు. వర్గీకరణ అవసరమని కేంద్రానికి నివేదించినా నేటికీ పెండింగ్‌లోనే ఉందన్నారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత 2014 నవంబర్ 9న ఎస్సీ వర్గీకరణ చేయాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి పంపామని, ఏపీ కూడా పంపిందని వివరించారు. వర్గీకరణతోనే ఉపాధి, అసమానతలు తొలగిపోతాయని, రాజ్యాంగ స‌వ‌ర‌ణ ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లో షెడ్యూల్ కులాల్లో వ‌ర్గీక‌ర‌ణ చేయాల‌ని ప్రధాని మోడీని కోరారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ప్రధాని మోడీకి రాసిన లేఖ‌ను లోక్‌స‌భ‌లో చ‌దివి వినిపించారు.

Advertisement

Next Story