- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను :వాణీదేవి
దిశ, వెబ్‌డెస్క్: తనను నమ్మి ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు అని తెలిపారు సురభి వాణీదేవి. సోమవారం ఉదయం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవి పీవీఘాట్‌లో నివాళులర్పించారు. పీవీఘాట్ వద్ద నామినేషన్ పత్రాలను పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు.
అనంతరం సురభి వాణీదేవి మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని స్పష్టం చేశారు. చాలా ఏళ్ల నుంచి విద్యాసంస్థలు నడిపిస్తున్నానని.. తనకు విద్య మీద పూర్తి అవగాహన ఉందని తెలిపారు. పట్టభద్రు సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని సురభి వాణీదేవి చెప్పుకొచ్చారు.
కాగా, ఇవాళ ఉదయం హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ నియోజవర్గం పరిధిలోని పార్టీ నేతలతో సీఎం కేసీఆర్ సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ భేటీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవి హాజరయ్యారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై నేతలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. సీఎం కేసీఆర్‌తో భేటీ అనంతరం వాణీదేవి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆదివారం మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె వాణీదేవి పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే.