దుబ్బాకలో టీఆర్ఎస్ ముందంజ..

by Shyam |   ( Updated:2020-12-28 01:37:59.0  )

దిశ, వెబ్‌డెస్క్/ మెదక్: దుబ్బాక ఫలితాల్లో అనూహ్య పరిమాణాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ అంచనాలను తలకిందులు చేస్తూ టీఆర్ఎస్ దూసుకుపోతోంది. ప్రారంభం నుంచి దూకుడు ప్రదర్శించిన కమలం.. కారు గేరు మార్చడంతో వెనకంజ వేసింది. 17వ రౌండ్ లోనూ కారు జోరు కొనసాగింది. మరో ఆరు రౌండ్లే మిగిలి ఉండడంతో అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ శ్రేణులు ఊపిరి బిగపట్టి టీవీలకు అతుక్కుపోయారు.

ఈ రౌండ్ లో బీజేపీకి 47,940, టీఆర్ఎస్‌కు 47,078, కాంగ్రెస్‌కు 16,537 ఓట్లు పోలయ్యాయి. ఈ రౌండ్ లో బీజేపీ అభ్యర్థి 862 ఓట్లతో ముందంజలో ఉన్నారు. ఇప్పటి వరకు 1,24,657 ఓట్లను లెక్కించారు. నోటాకు 448 ఓట్లు పడ్డాయి.

Advertisement

Next Story