- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రామాల్లో తిరగనివ్వం.. ఎమ్మెల్యే రఘునందన్‌కు హెచ్చరిక
దిశ, దుబ్బాక: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై అవాకులు, చెవాకులు పేల్చుతున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుకు టీఆర్‌ఎస్ నేతలు వార్నింగ్ ఇచ్చారు. ఉపఎన్నికలో దుబ్బాక ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించాలని సూచించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడారు. రైతులకు కాడెద్దులు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని మాయ మాటలు చెప్పి స్వల్ప మెజారిటీతో గెలిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతకాక పొద్దు గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
గెలిచి సంవత్సరం కాలం కావస్తున్నా ..ఒక్క పైసా పని కూడా దుబ్బాక నియోజకవర్గంలో చేయలేదని ఆరోపించారు. ఇప్పటికైనా మాయ మాటలు కట్టిపెట్టి దుబ్బాకకు ఇచ్చిన హామీలను నెరవేర్చి తర్వాత ప్రభుత్వంపై విమర్శలు చేయాలన్నారు. అనవసరమైన విమర్శలు చేస్తే దుబ్బాక నియోజక వర్గంలో ఎక్కడికక్కడ కార్యకర్తలు అడ్డుకుంటారని, గ్రామాల్లో తిరగనివ్వమని హెచ్చరించారు.