కేటీఆర్ వల్లే టీఆర్ఎస్ ఓడిపోతున్నది..

by Shyam |
కేటీఆర్ వల్లే టీఆర్ఎస్ ఓడిపోతున్నది..
X

దిశ,తెలంగాణ బ్యూరో : మంత్రి కేటీఆర్ అసమర్థ నాయకుడని మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి విమర్శించారు. బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో పార్టీ కోర్ సభ్యులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ బాధ్యతలు చేపట్టాక ఆ పార్టీకి అన్నీ అపజయాలే ఎదురవుతున్నాయన్నారు.

సీఎం సొంత జిల్లాలో దుబ్బాక సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాన్ని కోల్పోయారని విమర్శించారు. జీహెచ్ఎంసీలో ఎన్నికల్లోనూ చెప్పుకో దగిన ఫలితాలను సాధించలేకపోయారని ఎద్దేవా చేశారు. నాగార్జున‌సాగర్ ఉప ఎన్నికలోనూ ఆ పార్టీకి పరాభవం తప్పదన్నారు. మున్సిపల్, ఐటీ మంత్రిగా సైతం కేటీఆర్ విఫలమయ్యారని విమర్శించారు. ఆయన అసమర్థత కారణంగానే నివాసయోగ్యమైన నగరాల్లో 4వ స్థానంలో ఉన్న హైదరాబాద్‌ 24వ స్థానానికి పడిపోయిందన్నారు.

ముద్ర లోన్లు రావడం లేదని ఆయన చేసిన కామెంట్స్ అవాస్తవమన్నారు. ఈ ఏడాది రాష్ట్రానికి కేంద్రం రూ.4,705 కోట్ల ముద్ర లోన్లు ఇచ్చిందన్నారు. తండ్రి లాగే కొడుకు సైతం అబద్దాలు ఆడుతున్నాడని ఎద్దేవా చేశారు. ప్రధాని మోడీ ఫొటో పెట్టాల్సి వస్తుందనే కారణంతో సెంట్రల్ స్కీమ్స్‌ను రాష్ట్రంలో కేసీఆర్ ఇప్లిమెంట్ చేయడం లేదన్నారు. పెట్రోల్, డీజిల్ రేట్ల పెరుగుదలపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలు సరికాదని, ఈ విషయంలో కేంద్రం ఇప్పటికే ఓ ప్రకటన చేసిందన్నారు. కేంద్ర సూచన మేరకు పెట్రోల్‌ను జీఎస్టీ పరిధిలోకి తెస్తే రూ.25 వరకు ధర తగ్గుతుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed