ఈ-పాస్ యంత్రాలు పనిచేయక లబ్ధిదారుల ఇబ్బంది

by Shyam |   ( Updated:2020-04-03 07:26:57.0  )

దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అక్కన్నపేట మండలాల్లోని పలు గ్రామాల్లో రేషన్ దుకాణాల్లో ఈ పాస్ యంత్రాలు పనిచేయక లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తోంది. ఈ బియ్యం కోసం శుక్రవారం ఉదయం జనం రేషన్ దుకాణాల వద్దకు వెళ్లారు. సర్వర్ మొరాయించడంతో యంత్రాలు సరిగ్గా పనిచేయడం లేదు. ఫలితంగా బియ్యం పంపిణీ ఆలస్యంగా జరుగుతోంది. దీనితో లబ్ధిదారులు రేషన్ దుకాణాల వద్ద ఎండలో పడిగాపులు కాస్తున్నారు. ఈ పాస్‌తో సంబంధం లేకుండా నేరుగా బియ్యం పంపిణీ చేస్తే సమస్య ఉండదని లబ్ధిదారులు కోరుతున్నారు.

tag: trouble, beneficiaries, ration shops, e-pass machines, akkannapet, siddipet
slug: trouble of beneficiaries by not working e-pass machines

Advertisement

Next Story

Most Viewed