- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈనెల 31 న యుద్ధవీరుల కు సన్మానం..
దిశ, ఖైరతాబాద్ : దాయాది దేశం పాకిస్థాన్ తో 1971 సంవత్సరంలో జరిగిన ఇండో-పాక్ యుద్ధంలో పాల్గొన్న యుద్ధ వీరులను ఘనంగా సన్మానించినట్లు ఎయిర్ వెటరన్స్ అసోసియేషన్ తెలిపింది. శుక్రవారం పంజాగుట్టలోని అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ ను కార్యక్రమ చీఫ్ ప్యాట్రన్ సి బి ఆర్ ప్రసాద్, అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఎస్ డి ఫాతక్ లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాటి యుద్ధంలో వీరోచితంగా పోరాడి పరమవీరచక్ర అందుకున్న వారిని గౌరవించుకునే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.
ఈ నెల 31న రవీంద్రభారతిలో జరగనున్న కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. వాయుసేన విశీష్టతను నేటి యువతకు తెలియజేయాలని ఉన్నత తలంపుతో చేపడుతున్న ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన యుద్ధ వీరులు హాజరవుతున్నారని తెలిపారు. 50 మంది యుద్ధవీరులకు ఘన సన్మానం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి భోగేశ్వర రావు, ట్రెజరర్ మోహన్ రావు, జాయింట్ సెక్రటరీ సత్బీర్ యాదవ్, జాయింట్ ట్రెజరర్ కె.వి.రావు పాల్గొన్నారు.