వంగపండుకు నివాళులు

by Shyam |
వంగపండుకు నివాళులు
X

దిశ తుంగతుర్తి: ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజాగాయకుడు జానపద కళాకారుడు జానపద శిఖరం వంగపండు ప్రసాదరావు అకాల మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ బీసీ రిజర్వేషన్ సాధన సమితి బీఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం యాదాద్రి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ స్టేట్ గ్రాడ్యుయేట్ ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పోతుగంటి శంకర్ మాట్లాడారు. పేద ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహించిన తన ఆటపాటలతో తెలుగురాష్ట్రాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ఎస్, గ్రాడ్యుయేట్ ఫోరం నాయకులు భయ్యని రాజు, పట్టురి భద్రయ్య, బొల్లేపల్లి వీరేశం, దొంతోజు శ్రీను, చేతరశి వెంకన్న, వేణు, అరీఫ్ తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed