- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఇదేం వింత.. ఎండలో నిద్రపోతే ఇలా కూడా అవుతుందా..

దిశ, వెబ్‌డెస్క్: ఎండ మన శరీరానికి చాలా మేలు చేస్తుంది.. దాదాపు ప్రతి డాక్టర్ దీనిని ఒప్పుకుంటారు. కానీ అది కేవలం ఉదయం ఉండే ఎండ మాత్రమేనని, మధ్యాహ్నం సమయంలో ఉండే ఎండ కాదని కూడా వారు చెప్తారు. కానీ ఒకవేళ మనం రోజంతా ఎండలో ఉంటే ఏమవుతుంది అంటే.. మన శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం, మనం డీహైడ్రేషన్‌కు గురై కళ్లు తిరగడం వంటివి జరుగుతాయి. వాటితో పాటుగా మన చర్మం కాస్త ఎర్రబడుతుంది.
కానీ ఓ బ్రిటిష్ మహిళ విషయంలో మాత్రం ఓ వింత జరిగింది. కాసేపు ఎండలో నిద్రపోయినందుకు ఆమెకు ఆమె నుదురు భాగం ప్లాస్టిక్‌గా మారిపోయింది. బ్రిటిష్‌కు చెందిన 25 ఏళ్ల సిరిన్ మురాద్ ఎండలో 30 నిమిషాల పాటు నిద్రపోయింది. ఆ తర్వాత మేలుకున్న ఆమె తన నుదురు భాగంగా ప్లాస్టిక్ కవర్ మాదిరిగా కనిపించడం గమనించింది. ఇలా ఎందుకు ఎందుకు జరిగిందో తనకు అర్థం కావడం లేదన్న ఆమె.. ప్రతి ఒక్కరూ ఒక్కరూ సన్‌స్క్రీన్ వాడాలని హితవు పలికింది.
అయితే తాను ముందుగా ఎటువంటి మెడికల్ సలహా తీసుకోలేదు. కొన్ని రోజుల తర్వాత ఆమె పరిస్థితి దారుణంగా మారడం ప్రారంభమైంది. కొన్ని రోజుల తర్వాత ప్లాస్టిక్‌లా కనిపిస్తున్న చర్మం ఊడిపోవడం, ఆ ప్రదేశంలో పింక్ కలర్‌లో మారడం మొదలైంది. అయితే చర్మం ఊడటం మొదలైనప్పుడు తాను చాలా సంతోషించానని, కానీ అది చాలా బాధాకరంగా ఉండేదని సిరిన్ చెప్పుకొచ్చింది.