- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
యూట్యూబ్‌లో యాడ్స్‌తో చిరాకొస్తుందా? అయితే ఈ స్పెషల్ ఆఫర్ మీకోసమే.. ఏంటో తెలుసుకోండి!

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ దిగ్గజ టెక్ సంస్థ గూగుల్‌కు (Google) చెందిన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ (Youtube) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇన్నాళ్లు ఉచితంగా సేవలను అందిస్తూ వచ్చిన యూట్యూబ్ ఇటీవల ప్రీమియం సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇక ప్రీమియం సేవలు పొందేందుకు యూజర్లు.. ప్లాన్ బేస్‌డ్ డబ్బులు చెల్లించి సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రీమియం యూజర్లు యాడ్ ఫ్రీ కంటెంట్‌ను పొందవచ్చు. తాజాగా యూట్యూబ్ ప్రీమియం యూజర్లను పెంచుకునేందుకు కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగానే 'యూట్యూబ్ ప్రీమియం లైట్' పేరిట.. తక్కువ ఖర్చుతో యూజర్లకు యాడ్ ఫ్రీ కంటెంట్ అందించేందుకు సరికొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
అయితే, యూట్యూబ్ ప్రీమియం లైట్ సేవలు ప్రస్తుతం అమెరికాలో మాత్రమే అందించనుంది. త్వరలోనే ఆస్ట్రేలియా, జర్మనీ, థాయ్‌లాండ్ దేశాలకూ విస్తరించనున్నట్లు తెలిపింది. ఇక ధర నెలకు 7.99 డాలర్లు (సుమారుగా రూ.695)గా నిర్ణయించింది. అమెరికాలో ప్రస్తుతం ప్రీమియం ప్లాన్ ధర 13.99 డాలర్లుగా ఉంది. సాధారణ యూట్యూబ్ ప్రీమియం ప్లాన్‌తో పోలిస్తే.. లైట్ ప్లాన్‌లో కొన్ని ఫీచర్లను తగ్గించినట్లు తెలుస్తోంది. రెగ్యూలర్ ప్రీమియం ప్లాన్‌లో యాడ్‌ఫ్రీ వీడియోలతో పాటు యాడ్ ఫ్రీ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ ప్లే, డౌన్‌లోడ్ వంటి ఆప్షన్లు లభిస్తాయి. లైట్ ప్లాన్‌లో మాత్రం కేవలం యూట్యూబ్ వీడియోలను యాడ్స్ లేకుండా వీక్షించవచ్చు.
ప్రస్తుతం భారత్‌లో యూట్యూబ్ ప్రీమియం ప్లాన్ నెలకు రూ.159, ఏడాదికి రూ.1490గా ఉంది. ఫ్యామిలీ మొత్తానికి కావాలంటే నెలకు రూ.299 చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఈ ఏడాది యూట్యూబ్ తన 20వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ట్రయల్స్‌తో సహా మొత్తం 125 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉందని కంపెనీ తెలిపింది.