Viral: గడ్డితో చేసిన డ్రస్‌ వేసుకుని డాన్స్ చేస్తున్న బాలిక.. చివరకు గేదె ఇచ్చిన ట్విస్ట్ మాములుగా లేదుగా(వీడియో)

by Kavitha |   ( Updated:12 Sept 2024 11:54 AM  )
Viral: గడ్డితో చేసిన డ్రస్‌ వేసుకుని డాన్స్ చేస్తున్న బాలిక.. చివరకు గేదె ఇచ్చిన ట్విస్ట్ మాములుగా లేదుగా(వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి వివిధ రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని ఆశ్చర్యంగా ఉంటాయి. ప్రస్తుతం ఆ కోవకు చెందిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.

ప్రస్తుత కాలంలో చాలామంది పాపులారిటీ కోసం అడ్డదిడ్డమైన పనులు చేస్తున్నారు. వాటిని చూసి వారిని ఫేమస్ చేయడం పక్కన పెడితే.. తిట్టుకోవడమే ఎక్కువ ఉంటుంది. ప్రస్తుతం ఈ వీడియోలో కూడా ఈ అమ్మాయి చేసిన పనికి నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

ఓ బాలిక వినూత్నంగా రీల్ చేయాలనే ఉద్దేశంతో చివరకు (dress made of grass) గడ్డితో చేసిన డ్రెస్ వేసుకుంది. తర్వాత ఆమె గేదె పక్కన నిలబడి డ్యాన్స్ వేయడం స్టార్ట్ చేస్తుంది. అయితే కాసేపటికి గేదె బాలిక వేసుకున్న డ్రస్‌ను గమనిస్తుంది. ఆమె ఒంటిపై గడ్డి ఉండడం చూసి తినేయాలని ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో మెడ బాలిక (girl) దగ్గరగా చాపి గడ్డిని పీకేయాలని చూస్తుంది. దీంతో ఆ బాలిక ఒక్కసారిగా షాక్ అవుతుంది. వెంటనే గేదెకు (buffalo) దొరక్కుండా పక్కకు పారిపోతుంది. ఇలా గడ్డి డ్రెస్‌తో డాన్స్ చేయాలని చూసిన బాలికకు గేదె షాక్ ఇస్తుంది. దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక దీనిని చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ వీడియో 6 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Advertisement

Next Story

Most Viewed