Trending: పని మనిషి నిర్వాకం.. జ్యూస్‌లో ఏం కలిపిందో తెలిస్తే షాకే!

by Shiva |
Trending: పని మనిషి నిర్వాకం.. జ్యూస్‌లో ఏం కలిపిందో తెలిస్తే షాకే!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంట్లో పని భారంతో ఆర్థికంగా పటిష్టంగా ఉన్న కొందరు పని మనుషులను నియమించుకుంటున్నారు. ముఖ్యంగా ఆఫీసులకు వెళ్లే వారు ఇళ్లలో వృద్ధులు, పసి పిల్లలను చూసుకునేందుకు కేర్ టేకర్ల (Care Takers)ను పెట్టుకోవడం ఈ రోజుల్లో అందరికీ ఓ అలవాటుగా మారింది. అయితే, ఊరికే పని చెప్పి విసిగిస్తున్నారని అనుకుటుంటున్నారో ఏమో.. కొందరు పని మనుషులు దారుణాలకు పాల్పడుతున్నారు. కంటికిరెప్పలా కాపాడుకోవాల్సిన ఇంటి వాళ్లను యజమానుల కళ్లలో కారం కొడుతూ జుగుప్సాకరమైన పనులు చేస్తున్నారు. తాజాగా, ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలో ఓ పని మనిషి చేసిన పని అందరిని షాక్‌కు గురి చేసింది. యజమాని జ్యూస్ (Juice) తీసుకురమ్మని కోరగా.. అందులో తన మూత్రం కలిపేసింది. అయితే, అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media)లో విపరీతంగా వైరల్ అవుతోంది. సదరు యజమాని ఉత్తర్‌ప్రదేశ్ (Uttar PradesH) రాష్ట్రంలోని సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi Party) నాయకుడని ప్రాథమికంగా తెలుస్తోంది.

Advertisement
Next Story