- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Trending: ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఘోరంగా ఓడిన ఇంగ్లాండ్.. కన్నీళ్లు పెట్టిన జో రూట్ (వీడియో వైరల్)

దిశ, వెబ్‌డెస్క్: ఛాంపియన్స్ ట్రోఫీ-2025 (Champions Trophy-2025) నుంచి ఇంగ్లాండ్ జట్టు (England Team) నిష్క్రమించింది. బుధవారం లాహోర్ (Lahore) వేదికగా జరిగిన కీలక మ్యాచ్‌లో ఆ జట్టును ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) 8 పరుగుల తేడాతో ఓడించి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ముఖ్యంగా ఆఫ్గాన్ ఆటగాడు ఇబ్రహీం జద్రాన్ (Ibrahim Zadran) 146 బంతుల్లో 177 పరుగులు చేశాడు. అంతులో అందులో 6 సిక్సులు, 12 ఫోర్లు ఉన్నాయి. అదేవిధంగా ఆ జట్టు విజయంలో అజ్మతుల్లా ఒమర్జాయ్ (Azmatullah Omarzai) ఏకంగా 5 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టు నడ్డి వరిచాడు. ఇంగ్లాండ్ తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో విజయం అంచుల దాకా వెళ్లి బొక్కబోర్లా పడింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 325 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లాండ్ (England) జట్టు 49.5 ఓవర్లలో 317 పరుగులకు ఆలౌట్ అయింది. విజయంతో ఆఫ్ఘనిస్తాన్ సెమీ-ఫైనల్ రేసులో కొనసాగుతుండగా ఇంగ్లీష్ జట్టు ఇంటిదారి పట్టింది. జో రూట్ (Joe Root) 120 పరుగులు చేసినా తన జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయాడు. ఈ క్రమంలోనే ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ గెలిచిన వెంటనే ఆ జట్టు ఆటగాళ్లు సంబురాల్లో మునిగి తేలారు. అది చూసిన జో రూట్ కంటతడి పెట్టాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా (Social Media)లో విపరీతంగా వైరల్ అవుతోంది.