- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గిన్నిస్ రికార్డ్.. ముక్కే తొండంగా మారిన ఏకైక మనిషి ఈయనే..!
దిశ, వెబ్‌డెస్క్: కొంత మంది అందంగా ఉన్నప్పటికి వాళ్లకు ఫేస్‌లో ఏదో ఒక లోపం ఉంటుంది. ముక్కు, మూతి, లిప్స్ ఇలా కొన్ని పార్ట్స్ అతి పెద్దగా లేక చిన్నగా ఉంటాయి. అయితే.. వీటి వల్ల కొంత మంది విమర్శలు ఎదుర్కొంటారు. కానీ.. కొందరు మాత్రం తన లోపాలను హైలెట్‌గా చూపించుకుని గిన్నిస్ రికార్డులు సాధిస్తుంటారు. అలాంటి ఓ వ్యక్తి గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.
అతని పేరు థామస్ వెడర్స్. ఇంగ్లాండుకు చెందిన ఈయన 18వ శతాబ్దంలో సర్కస్ పర్ఫామర్‌గా జీవించేవాడు. ఇప్పటికే తెలిసి ఉంటుంది ఈయన ఇప్పటి వ్యక్తి కాదని. అవును థామస్ వెడర్స్ 1770 కాలానికి చెందిన వ్యక్తి. ఆయనకు అందరి కంటే డిఫరెంట్‌గా పెద్ద ముక్కు ఉండేది. అది ఎంత పెద్దది అంటే తాను గిన్నిస్ రికార్డ్ సాధించే అంతా. అంతే కాదు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేక పోయారు.
ఇప్పటికి కూడా పెద్ద ముక్కు కలిగిన వ్యక్తిగా గిన్నిస్ రికార్డ్‌లో ఆయనదే మొదటి పేరు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. వాటిని చూసిన నెటిజన్స్.. “అది ముక్కు కాదు ఒక తొండం” అని ‘‘వామ్మో ఇంత పెద్ద ముక్కా? ఆ ముక్కుతో నాలుగు రోజుల క్రితం ఏం వంటకాలు వండారో కూడా ఇతను వాసన చూసి చెప్పగలడేమో’’ అంటూ ఫన్నీగా స్పందిస్తున్నారు నెటిజన్స్. నిజానికి అంతా పెద్ద ముక్కుతో ఆయన ఎలా జీవించాడో కదా..!