- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
viral video: పాఠాలు చెప్పాల్సిన ప్రొఫెసర్ విద్యార్థితో ఏం చేసిందో చూడండి!

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచం నలుమూలల జరిగిన అనేక విషయాలు, వింతలకు సంబంధించిన వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరి కొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. అయితే, తాజాగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నాదియా జిల్లాలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, హరిన్‌ఘర్ క్యాంపస్‌లో జరిగిన షాకింగ్ ఘటన నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
యూనివర్సిటీలోని ఓ తరగతి గదిలో ఒక వివాహ వేడుక జరిగింది. ఇందులో ఆశ్చర్యం ఏముంది అనుకుంటున్నారా? వివాహం జరిగింది ఒక విద్యార్థికి, మహిళ హెడ్ ప్రొఫెసర్‌కి.. మొదటి సంవత్సరం విద్యార్థిని డిపార్ట్‌మెంట్ హెడ్ ప్రొఫెసర్ వివాహం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ప్రొఫెసర్ పెళ్లి కూతురులా అలంకరించుకుని అందంగా ముస్తాబై హిందూ బెంగాలీ వివాహ సంప్రదాయం ప్రకారం.. 'సిందూర్ దాన్', 'మాలా బదలా' (పూలదండలు మార్చుకోవడం) వంటి క్రతువులన్నీ జరగటం ఉన్నాయి. అంతేకాదు, ఈ పెళ్లికి ఇద్దరు సాక్షుల సంతకాలతో పాటు యూనివర్సిటీ ప్యాడ్‌పై భార్యాభర్తల లిఖితపూర్వక ఒప్పందం కూడా ఉండడం గమనార్హం.
ఈ వీడియో కాస్తా వైరల్ కావడంతో యూనివర్సిటీ ప్రొఫెసర్లు స్పందించారు. ఓ ప్రాజెక్ట్‌లో భాగమైన సైకలాజికల్ డ్రామా అని చెబుతున్నారు. నాటక రూపంలో పిల్లలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇలా చేసినట్లు వివరించారు. అయితే కొందరు ఉద్దేశపూర్వకంగానే ఆ డ్రామాలోని ఓ పార్ట్ మాత్రమే వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేశారన్నారని సదరు మహిళ ప్రొఫెసర్ తెలిపారు. వీడియోను తప్పుగా సోషల్ మీడియాలో వైరల్ చేసిన వారిపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తానని చెప్పారు. అయితే, ఈ ఘటనపై యూనివర్సిటీ యాజమాన్యం విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. అలాగే సదరు మహిళ ప్రొఫెసర్ నుంచి వివరణ కోరిన అధికారులు విచారణ ముగిసేదాకా ఆమెను సెలవుపై వెళ్లాల్సిందిగా కోరారు. సంబంధిత విద్యార్థికి కూడా ఇదేవిధంగా సూచించారు.