- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
#GetOutModi "గెట్ అవుట్ మోడీ" ఎక్స్‌లో హ్యాష్‌ట్యాగ్ వరల్డ్ ట్రెండింగ్.. ఎందుకంటే?

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ సర్కార్‌కు వ్యతిరేకంగా '#GetOutModi " గెట్ అవుట్ మోడీ " అనే హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో నిరసన తెలియజేస్తున్నారు. ఈ మేరకు తాజాగా గెట్ అవుట్ మోడీ అనే హ్యాష్‌ట్యాగ్ ఎక్స్(ట్విట్టర్) (x) వేదికగా ప్రపంచ వ్యాప్తంగా ట్రెండింగ్‌లో మొదటి స్థానంలో నిలిచింది. 147 వేలకు పైగా గెట్ అవుట్ మోడీ హ్యాష్‌ట్యాగ్ పోస్టులను ఎక్స్ వేదిగా షేర్ చేశారు. మరోవైపు ఇతర సామాజిక మాధ్యమాల్లో సైతం నిరసన ట్రెండ్ కొనసాగిస్తున్నారు. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) వ్యాఖ్యల నేపథ్యంలో గెట్ అవుట్ మోడీ నిరసనకు దారితీసింది. (National Education Policy (NEP) నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కింద మూడు భాషల పాలసీని అమలు చేసేదాకా తమిళనాడుకు సమగ్ర శిక్ష అభియాన్ కింద నిధులు ఇచ్చేది లేదని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవలే స్పష్టం చేసిన నేపథ్యంలో ఉదయనిధి స్టాలిన్ మండిపడ్డారు.
‘మేమేమీ మీ తండ్రి సంపాదించిన సొమ్ము అడగడం లేదు... మాకు హక్కుగా రావాల్సిన నిధులే మేము అడుగుతున్నాం.. తమిళనాడు ప్రజల కట్టే పన్ను డబ్బులనే మేము అడుగుతున్నాం’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక, బీజేపీ బెదిరింపులకు భయపడేదని లేదని, బీజేపీ ప్రభుత్వం హిందీని రుద్దడం (Hindi imposition) కొనసాగిస్తే, ప్రధాని తమిళనాడు పర్యటనకు వచ్చినప్పుడు 'గో బ్యాక్ మోడీ' కి బదులుగా 'గెట్ అవుట్ మోడీ' నినాదాలు ఎదుర్కోవలసి వస్తుందని ఉదయనిధి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తాజాగా ఢిల్లీ సీఎంగా రేఖ గుప్తా ప్రమాణ స్వీకారం వేళ సోషల్ మీడియాలో గెట్ అవుట్ మోడీ హ్యాష్‌ట్యాగ్‌తో ట్రెండ్ చేస్తూ బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోడీని విమర్శిస్తూ డీఎంకే శ్రేణులు, నెటిజన్లు పోస్టులు షేర్ చేస్తున్నారు.