viral: అక్కడ వర్షం కురిస్తే ఇక్కడ పర్యావరణానికి ముప్పు.. నిపుణుల హెచ్చరిక..

by Indraja |
viral: అక్కడ వర్షం కురిస్తే ఇక్కడ పర్యావరణానికి ముప్పు.. నిపుణుల హెచ్చరిక..
X

దిశ వెబ్ డెస్క్: ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వర్షాలు గల్ఫ్ దేశాలను అతలాకుతలం చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఎప్పుడూ లేని విధంగా ఈ సారి గల్ఫ్ దేశాలను వరదలు ముంచెత్తాయి.ఈ నేపథ్యంలో దుబాయ్‌లో విమానాశ్రయం కూడా పూర్తిగా జలమయం అయింది. రోడ్డు మార్గాలు కూడా వరద నీటితో నిండిపోయి రాకపోకలు నిలిచి పోయాయి.

ఇక ఏడాదిన్నర కురవాల్సిన వర్షం కొన్ని గంటల్లోనే కురిసింది. 75 ఏళ్ళలో ఎప్పుడూ కురవని రీతిలో ఇప్పడు వర్షం కురవడంతో ఎడారి దేశంలోని గుంటల్లో నీరు ముంచెత్తుతోంది. కాగా గల్ఫ్ దేశాల్లో కురిసిన వర్షాల తీవ్రతకు సంబంధించిన ఆనవాళ్లు ఉపగ్రహాల్లో స్పష్టంగా కనిపించింది. ఇక నాసాకు చెందిన ఉపగ్రహం ల్యాండ్ శాట్-9 కొన్ని ఫోటోలను తీసింది.

ఆ ఫోటోల్లో గల్ఫ్ దేశాల్లోని వరద గుంటలు నీలిరంగులో దర్శనమిస్తున్నాయి. అయితే దుబాయ్ వంటి ఎడారి దేశాల్లో రికార్డు స్థాయిలో వర్షాలు కురవడం మంచిది కాదని పర్యావరణ నిపుణులు పేర్కొంటున్నారు. దుబాయ్ వంటి దేశాల్లో తీవ్ర స్థాయిలో వర్షాలు కురవడం కారణంగా మిగిలిన ఖండాల్లో పర్యావరణానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎందుకంటే దుబాయ్ అనేది అరేబియా సముద్రంలో ఉన్న ఓ ఎడారి ద్వీపం. అలాంటి ఎడారిలో నీరు కాలువల్లా ప్రవహించే స్థాయిలో వర్షం కురిసింది అంటే.. అది పర్యావరణంలో వస్తున్న మార్పులే అని నిపుణులు భయపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed