Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?

by D.Reddy |
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. ఇవాళ స్వామివారి దర్శనం కోసం 14 కంపార్టుమెంట్లలో భక్తులు (Devotees) వేచి ఉన్నారు. దీంతో సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. ఇక బుధవారం శ్రీవారిని 62,076 మంది భక్తులు దర్శించుకోగా, 23,699 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.27 కోట్లు సమకూరినట్లు TTD అధికారులు తెలిపారు.

నేటి నుంచి సాలకట్ల వసంతోత్సవాలు ప్రారంభం

తిరుమలలో నేటి నుంచి స్వామివారి సాలకట్ల వసంతోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 12న ఈ ఉత్సవాలు ముగియనున్నాయి. ఈ ఉత్సవాల నేపథ్యంలో మూడు రోజుల పాటు స్వామివారి కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను TTD రద్దు చేసింది.



Next Story

Most Viewed