- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మూత్రంలో నానబెట్టి ఉడకబెట్టిన గుడ్లు.. ఆహా ఏమి రుచి అంటూ లొట్టలేసుకుని తింటున్న జనాలు
దిశ, వెబ్ డెస్క్: చిన్నా పెద్దలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజు ఒక కోడి గుడ్డును తినాలని వైద్యులు చెబుతుంటారు. గుడ్డులో ఉండే పోషకాలు మన ఆరోగ్యానికి మంచి ఫలితాలను ఇస్తాయని అందరూ ఉడకబెట్టిన గుడ్డును తింటుంటారు. అయితే సాధారణంగా అందరూ గుడ్లను నీటిలో కాస్త ఉప్పు వేసి ఉడికిస్తారు. అలాగే గుడ్డు చెదిరిపోకుండా పొట్టు రావాలని కొంచెం నూనె వేస్తారు. కానీ, చైనాలో మాత్రం చిన్న పిల్లల మూత్రంలో గుడ్లను ఉడకబెట్టి ఇష్టంగా రోజుకు ఒకటి తింటున్నారు. దీనికి ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే.. చైనాలోని జేజియాంగ్ ప్రావిన్స్ తీరంలో మనుషుల మూత్రంలో ఉడకబెట్టిన గుడ్లను జనాలు లొట్టలేసుకుని తింటున్నారు. అసలు విషయంలోకి వెళితే.. డోంగ్యాంగ్ ప్రాతంలో స్కూల్స్‌లో వ్యాపారస్తుల ముందుగానే పెద్ద పెద్ద పాత్రలను స్కూల్ మూత్ర శాలలో పెడతారు. అందులో 10 ఏళ్ల లోపు ఉన్న పిల్లల మూత్రాన్ని బద్రపరుస్తారు. అదేలాగంటే పాఠశాల అయిపోయాక పిల్లలను ఇంటికి తీసుకువెళ్లడానికి పాఠశాల ముందు తల్లిదండ్రులు క్యూ కట్టి వారిని తీసుకెళతారు. అయితే అక్కడకు వ్యాపారస్తులు కూడా బకెట్లు, డ్రమ్ములు వంటి పెద్ద పెద్ద పాత్రలను పట్టుకుని వారు కూడా క్యూ కడతారట. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు. ఆ పాత్రల్లో వ్యాపారస్తులు స్కూల్ మూత్రశాలల్లోకి వెళ్లి అందులో యూరిన్‌ను సేకరిస్తారు.
ఎంటీ నమ్మడం లేదా మీరు వింటున్నది నిజమే. ఆ సేకరించిన యూరిన్‌లో గుడ్లను ఒకరోజంతా నానబెట్టి అదంతా అందులోకి పీల్చుకునే దాక వాటిని ఉడకబెడతారు. గుడ్డు పెంకు పగిలే వరకు ఉడికించి ఆ తర్వాత మార్కెట్లో విక్రయిస్తారు. మూత్రంలోని ఉప్పు గుడ్డు లోపలికి వెళ్లి రుచికరంగా మారి మంచి సువాసనను వెదజల్లుతాయట. వాటిని చైనా ప్రజలు ఎంతో చాలా టేస్టీ గా ఉన్నాయని వాసన కూడా భాగుందని లొట్టలేసుకుని కుటుంబమంతా తింటారు. కొన్నేళ్ల నుంచి వీటిని తినడం వారికి అలవాటు అయిపోయిందట.
అంతేకాకుండా ఈ గుడ్లను తినడం వల్ల శరీరంలో వేడి, కీళ్ల నొప్పులు తగ్గుతాయని అంటున్నారు. మూత్రంతో గుడ్లను మాత్రమే కాకుండా పలు రకాల వంటకాలను తయారు చేసుకుని ఎంతో ఇష్టంగా ఆరగిస్తారు. అయితే అక్కడి వైద్యులు మాత్రం అది మంచి పద్ధతి కాదని అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఆ ప్రాంత స్థానికులు మేము ఎన్నో ఏళ్ల నుండి మూత్రంతో వంటకాలను తయారు చేసుకుని తింటున్నామని అంటున్నారట. అక్కడి ప్రజలు మూత్రంలో ఉడకబెట్టిన గుడ్డు తినందే రోజు గడవదట. ఈ విషయం తెలుసుకున్న వారు అదేం వంటకాలు అంటూ షాకవుతున్నారు.