- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వరద బాధితులకు రూ.600 విరాళం.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఇదే..!
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు ఏపీ అతలాకుతలమైన విషయం తెలిసిందే. ముఖ్యంగా విజయవాడ ముంపు బారిన పడి ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇక ఇదే సమయంలో వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన నష్టానికి సినీ, రాజకీయ ప్రముఖులు మాత్రమే కాదు సామాన్య ప్రజలు కూడా తమ వంతుగా ముఖ్యమంత్రి సహాయ నిధికి సహకారం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రోజువారీ కూలి పని చేసుకునే ఓ వ్యక్తి ముఖ్యమంత్రి సహాయ నిధికి 600 రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఈ విషయాన్ని సదరు వ్యక్తి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
“ఈరోజు నేను పనికి వెళ్లి సంపాదించిన ఈ రూ. 600 విజయవాడ వరద బాధితులకు @AndhraPradeshCM సహాయ నిధికి పంపిస్తున్నాను. ఆదివారం పని ఉంది ఆ డబ్బులు కూడా పంపిస్తాను. నాకు స్ఫూర్తి @PawanKalyan గారు. కష్టాలన్నవి అందరికీ వస్తుంటాయి. ఆ కష్టం ఏంటన్నది కష్టపడిన వాడికి మాత్రమే తెలుస్తుంది” అంటూ గొడవర్తి సుబ్రహ్మణ్యం X వేదికగా పేర్కొన్నారు. అయితే దీనిపై తాజాగా ఏపీ డిప్యూటీ సీఎంవో పవన్ కళ్యాణ్ స్పందించారు. అతన్ని అభినందిస్తూ ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టాడు.
“రోజువారీ కష్టం చేసుకుంటూ సంపాదించిన మీ కష్టార్జితం నుండి వరద బాధితులకు సహాయం అందించాలనుకున్న మీ ఆలోచన స్ఫూర్తిదాయకం. ఆపదలో ఉన్నవారికి మనస్ఫూర్తిగా ఇచ్చే ప్రతీ రూపాయి విలువైనది, అది చిన్నది అని సంకోచించే వారికి ఇది ఒక ప్రేరణ . నిస్వార్ధంగా ప్రజల కష్టాల కోసం ఆలోచించి ముఖ్యమంత్రి సహాయనిధికి @SUBRAHMANYAMPDP గారు అందించిన 600 రూపాయలు చాలా విలువైనవి. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు” అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ట్వీట్ బాగా వైరల్ అవుతుంది. సహాయం చిన్నదా పెద్దదా అన్నది కాదు సహాయం చేసే మనసు ఉండటం ముఖ్యం అన్నది ఈ పోస్టు ద్వారా అందరికీ అర్థమవుతుంది.
రోజువారీ కష్టం చేసుకుంటూ సంపాదించిన మీ కష్టార్జితం నుండి వరద బాధితులకు సహాయం అందించాలనుకున్న మీ ఆలోచన స్ఫూర్తిదాయకం. ఆపదలో ఉన్నవారికి మనస్ఫూర్తిగా ఇచ్చే ప్రతీ రూపాయి విలువైనది, అది చిన్నది అని సంకోచించే వారికి ఇది ఒక ప్రేరణ . నిస్వార్ధంగా ప్రజల కష్టాల కోసం ఆలోచించి ముఖ్యమంత్రి… https://t.co/zxnq7XM7UL
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) September 7, 2024
(video link credits to Deputy CMO, Andhra Pradesh X account)