- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Bharatpe: వారానికి 90 గంటల కంటే, పని నాణ్యత ముఖ్యం: భారత్‌పే సీఈఓ

దిశ, బిజినెస్ బ్యూరో: వారంలో 90 గంటల పని గురించి ఎల్అండ్‌టీ ఛైర్మన్ చేసిన వ్యాఖ్యలపై దేశీయ కంపెనీల్లో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. దీనిపై పలువురు వ్యాపారవేత్తలు, ప్రముఖులు స్పందించారు. ఈ నేపథ్యంలోనే భారత్‌పే సీఈఓ నలిన్ నేగి మాట్లాడుతూ.. ఎన్ని గంటలు పని చేశామనే దానికంటే, ఎంత నాణ్యతతో పని చేశామనేదే ముఖ్యం. పని గంటల కంటే, ఒక సంస్థలో ఉత్పాదకత కీలకమన్నారు. భారత్‌పే ప్రారంభించి ఇప్పటికి ఆరేళ్లు. సంస్థలోని ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉండాలనేదే తమ లక్ష్యమని చెప్పారు. వర్క్-లైఫ్ బ్యాలెన్స్ గురించి చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంది. కొత్త సంస్థగా, ఉద్యోగులు అత్యుత్తమ పనితీరు అందించగలిగే సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పించడం భారత్‌పే ఉద్దేశమని తెలిపారు. కంపెనీగా ఉద్యోగాలను కల్పించడమే కాదు, వారికి భవిష్యత్తును అందించగలగాలి. దానిపైనే తమ దృష్టి ఉంటుందని జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నలిన్ నేగి స్పష్టం చేశారు. వారానికి 90 గంటల పనిపై తనకు నమ్మకం లేదన్న ఆయన, ఉద్యోగి సంతోషంగా పనిచేస్తేనే సంస్థకు లాభం ఉంటుందన్నారు.