- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టిల్లు స్క్వేర్ సక్సెస్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ ధరించిన వాచ్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
దిశ వెబ్ డెస్క్: గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బీజీబిజీగా ఉన్నారు. కాగా అంత బిజీ షెడ్యూల్ లోనూ ఆయన టిల్లు స్క్వేర్ సక్సెస్ ఈవెంట్ కి అతిథిగా విచ్చేసారు. ఇక సిద్ధూ జొన్నలగడ్డ అనుపమ జంటగా DJ టిల్లు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రం 100 కోట్ల మార్క్ ని క్రాస్ చేసి బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచిన విషయం అందరికి తెలిసిందే.
ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. కాగా ఈ సక్సెస్ మీట్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్టీఆర్ ఫార్మల్ డ్రెస్సులో చాలా సింపుల్ లుక్ తో ఆకట్టుకున్నారు. అయితే చేతికి పెట్టుకున్న వాచ్ మాత్రం చాలా గ్రాండ్ గా కనిపించింది. దీనితో అభిమానుల ద్రుష్టి ఎన్టీఆర్ వాచ్ పైకి మళ్లింది.
ఇంకేముంది ఎన్టీఆర్ అభిమానులు ఆ వాచ్ ధర ఎంతో తెలుసుకునేందుకు ఇంటర్ నెట్ ని జల్లెడ పట్టేశారు. చివరికి ఆ వాచ్ ధరను తెలుసుకున్నారు. కాగా టిల్లు స్క్వేర్ సక్సెస్ ఈవెంట్ లో ఎన్టీఆర్ ధరించిన వాచ్ Audemars Piguet Royal Oak Offshore మోడల్ వాచ్, దాని ధర అక్షరాలా రూ/ 1 ,62 ,32,657 అని తెలిసింది. కాగా ప్రస్తుతం ఈ విషయాన్ని ఎన్టీఆర్ అభిమానులు నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఇక ఈ ధర చూసిన నెటిజెన్స్ షాక్ అవుతున్నారు.