సమోసాలో బిర్యానీ.. ఆహార ప్రియుల రియాక్షన్ ఇదే

by Mahesh |   ( Updated:2023-03-29 10:13:14.0  )
సమోసాలో బిర్యానీ.. ఆహార ప్రియుల రియాక్షన్ ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: భారత వంటకాల్లో హైదరాబాద్ బిర్యానికి పెట్టింది పేరు. అలాగే చాయ్ సమోసాకు కూడా ప్రత్యేక ఆదరణ ఉంది. కానీ ఈ రెండు కలీపి సమోసా బిర్యానీ కొత్తగా ట్రై చేశాడు ఓ వ్యక్తి. దీంతో ఇది నచ్చని వారు అతన్ని ఘోరంగా ట్రోల్ చేయడమే కాకుండా తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే బిర్యానికి ఉండే టెస్ట్ అలాంటిది. అలాగే సమోసాకు ఉండే క్రేజ్ చెప్పలేనిది కాబట్టి.

@khansaamaa అనే వినియోగదారు ట్విట్టర్‌లో సమోసా బిర్యానీ ఫోటోలు షేర్ చేశాడు. దీంతో ఈ కన్ఫ్యూజన్ కాంబినేషన్‌పై ఆహార ప్రీయులు ఆసక్తి చూపడం దేవుడెరుగు గాని ఘోరంగా అస్య హించుకుంటున్నారు. ట్విట్టర్‌లో సమోసా బిర్యానిపై స్పందింస్తున్న నెటిజన్లలో ఒకరు “రిప్ సమోసా మరియు బిర్యానీ” అని వ్యాఖ్యానించగా.. మరోకరు దాన్ని సృష్టించిన వ్యక్తిని వంటగది నుండి నిషేధించాలని సూచించారు. కాగా కొంతమంది మాత్రం ఇదేదో కొత్తగా ఉందే ట్రై చేస్తే పోలే అని అనుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి:డయాబెటిక్ పేషెంట్స్ రంజాన్ ఉపవాసం ఉండొచ్చా?

Advertisement

Next Story