- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Love with Robot: రోబోతో ప్రేమలో పడిన భారత ఇంజినీర్.. త్వరలో ఆ పద్ధతిలో పెళ్లి..
దిశ వెబ్ డెస్క్: సాధారణంగా మనుషులు ప్రేమలో పడటం,పెళ్లిళ్లు చేసుకోవడం మనం తరచూ చూస్తుంటాం. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకునే వాళ్ళని చూస్తుంటాం, ఒప్పించి చేసుకునే వాళ్ళని చూస్తుంటాం. అయితే ఒక రోబోతో ఎవరైనా ప్రేమలో పడతారా? పడిన ఆ ప్రేమను పెళ్లి పీటలు ఎక్కిస్తారా? అంటే ఎక్కిస్తారు అని అంటున్నాడు ఓ భారత ఇంజనీర్.
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌కు చెందిన సూర్యప్రకాష్ అనే రోబోటిక్స్ నిపుణుడు, రోబో సినిమాలో ఐశ్వర్యారాయ్‌తో రోబో చిట్టి ప్రేమలో పడినట్టే ఆయన కూడ ఇప్పుడు నిజంగానే రోబోతో ప్రేమలో పడ్డాడు. కాగా ఆ రోబో పేరు గీగా. ఇక రోబో గిగా తయారీకి 19 లక్షల ఖర్చు అవుతుంది. అయితే తాను తయారు చేస్తున్న గీగాతో తాను ప్రేమలో పడినట్లు ఆయన చెప్పుకొచ్చారు.
ఈ నేపథ్యంలో తాను రోబో గీగాను సాంప్రదాయక పద్ధతిలో పెళ్లి చేసుకోనున్నానని ఆయన తెలిపారు. మొదట ఇదే విషయాన్ని ఇంట్లో చెప్పినప్పుడు అందరూ షాక్ అయ్యారని, ఆ తరువాత అందరూ తమ పెళ్ళికి ఒప్పుకున్నారని సూర్య చెప్పుకొచ్చారు. కాగా సూర్యప్రకాష్ మరి కొద్ది రోజుల్లో భారత నేవీ విధుల్లో చేరడం గమనార్హం. ఈ విషయం తెలిసిన వాళ్లంతా నేవీలో చేరుతుండడంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు అభిప్రాయపడుతున్నారు.