ఎందుకు బ్రో ఈ ఎక్స్‌ట్రాలు.. పబ్లిక్ ప్లేస్‌లో పరువు పోయిందిగా.. (వీడియో)

by sudharani |   ( Updated:2023-10-02 09:35:22.0  )
ఎందుకు బ్రో ఈ ఎక్స్‌ట్రాలు.. పబ్లిక్ ప్లేస్‌లో పరువు పోయిందిగా.. (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్య కాలంలో చాలా మంది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసం ఏదేదో చేస్తున్నారు. ముఖ్యంగా జనాలు ఎక్కువగా ఉన్న ప్లేస్‌లో స్టంట్లు చేస్తు ఈజీగా పాపులర్ అవ్వొచ్చు అని.. రద్దీ ఉన్న ప్లేస్‌లో స్టంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది మెట్రో ట్రైన్‌లో వీడియోలు చేసి వైరల్ అవుతున్నారు. అదే విధంగా చేద్దాం అనుకుని ఓ వ్యక్తి పరువు మొత్తం పోగొట్టుకుని.. నవ్వుల పాలయ్యాడు. తాజాగా ఈ సంఘటన మెట్రో ట్రైన్‌లో జరిగింది.

అందరి ముందు ఓ వ్యక్తి స్టంట్ చేయాలని అనుకున్నాడు. అతడి స్నేహితులు వీడియో తీస్తుండగా అతడు గాలిలో పల్టీలు కొట్టేందుకు ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయత్నం వికటించడంతో తల నేలకు బలంగా తాకింది. ఈ సంఘటనతో రైలులో ఉన్న ప్రయాణికులు షాక్‌కు గురయ్యారు. కొంత మంది అయితే బలే అయింది అనుకోగా.. మరికొందరు నవ్వు ఆపుకున్నారు. దీంతో మనోడు నెత్తిన చేయి పెట్టుకుని పక్కకు వచ్చేశాడు. ఇకేముంది పబ్లిక్‌లో పరువు పోగొట్టుకున్నట్లు అయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed