వింత ఆచారం.. కొత్త అల్లుడిని గాడిదపై ఊరేగింపు (వీడియో)

by Hamsa |   ( Updated:2023-03-08 10:11:03.0  )
వింత ఆచారం.. కొత్త అల్లుడిని గాడిదపై ఊరేగింపు (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా కొత్త అల్లుడు అత్తారింటికి వస్తే అత్తమామలు వారి బంధువులు అల్లుడికి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంటారు. అలాగే రుచికరమైన వంటలు వడించి గౌరవంగా చూస్తారు. కానీ, మహారాష్ట్రలోని విడా గ్రామంలో మాత్రం కొత్త అల్లుడిని గాడిదపై ఊరేగిస్తారు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో విడా గ్రామంలో 82 ఏళ్ల నుండి వింత ఆచారం కొనసాగుతుంది. హోలీ తర్వాత కొత్త అల్లుడు ఊరిలో ఎవరింటికి వచ్చినా గ్రామస్తులు అతడిని గాడిదపై ఊరేగిస్తారు. ఈ సంప్రదాయానికి కులం మతం అని తేడా ఉండదు. అందరికీ ఇదే ఆచారం కొనసాగుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి : హిందూ దేవాలయంలో ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం వివాహం

Advertisement

Next Story

Most Viewed