జాలర్ల వలలో చిక్కిన కొండచిలువ

by srinivas |   ( Updated:2020-10-08 04:18:49.0  )
జాలర్ల వలలో చిక్కిన కొండచిలువ
X

దిశ, వెబ్‎డెస్క్ : కృష్ణానది పాయలో జాలర్ల వలలో 15 అడుగుల కొండచిలువ చిక్కింది. ఈ ఘటన కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం దేవరపల్లి వద్ద చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. కృష్ణానది పాయలో కొందరు మత్స్యకారులు చేపల కోసం వల విసరగా, చేపలతో పాటు పెద్ద కొండచిలువ పడింది. 15 అడుగుల కొండచిలువను చూసిన జాలర్లు.. విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలియజేశారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు కొండచిలువను అటవీప్రాంతంలో వదిలిపెట్టారు.

Advertisement

Next Story

Most Viewed