- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మైనర్ బాలుడిని జువైనల్ హోంకు తరలింపు
దిశ, కూకట్‌పల్లి: కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మైనర్ బాలిక అదృశ్యమైన కేసు నమోదయ్యింది. ఈ ఘటనపై పోలీసుల వివరాల ప్రకారం… కేపీహెచ్‌బీ 4వ ఫేజ్‌కు చెందిన బాలుడు(16), స్థానికంగా ఉన్న మరో మైనర్ బాలిక(16) ప్రేమించుకున్నారు. దీంతో ఇరువురు పెళ్లి చేసుకుందామని నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో గతనెల ఇద్దరు కలిసి, అనంతపురం జిల్లా కదిరికి వెళ్లారు. ఇదే క్రమంలో బాలిక కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిందండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అనంతరం విశ్వసనీయ సమాచారం మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు కదిరి వెళ్లారు. అప్పటికే ఆ బాలుడు బాలికను అత్యాచారం చేసి పరారయ్యాడు. దీంతో బాలికను అదుపులోకి తీసుకున్న పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. పరారీలో ఉన్న బాలుడిని సోమవారం కూకట్‌పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విషయమై విచారణ నిమిత్తం, బాలుడ్ని జువైనల్ హోమ్‌కు తరలించారు.