PM Modi: కలలో కూడా ఊహించని రీతిలో శిక్షిస్తాం.. ఉగ్రవాదులకు ప్రధాని మోడీ మాస్ వార్నింగ్

by Shiva |   ( Updated:2025-04-24 07:54:44.0  )
PM Modi: కలలో కూడా ఊహించని రీతిలో శిక్షిస్తాం.. ఉగ్రవాదులకు ప్రధాని మోడీ మాస్ వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: పహల్గాం (Pahalgam)లో ఉగ్రవాదలు అమాయకులను పొట్టన పెట్టుకున్నారని ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) అన్నారు. ఇవాళ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా ఆయన బిహార్ రాష్ట్రం (Bihar State)లోని మధుబని (Madhubani)లో ప్రర్యటిస్తున్నారు. ఈ మేురకు ఆయన రూ.13,480 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ (Amrit Bharat Express)తో పాటు నమో భారత్ (Namo Bharat) రైలును ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి మృతులకు ఆయన నివాళులర్పించారు. అదేవిధంగా 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. మృతుల ఆత్మశాంతి కోసం సంతాపం తెలపాలని సభకు వచ్చిన వారిని కోరారు.

ఇది పర్యాటకులపై దాడి కాదు.. ఇది భారత్‌పై దాడి

పహల్గాం (Pahalgam)లో ఉగ్రమూకలు నరమేధం సృష్టించారని కామెంట్ చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారికి దేశంమంతా నివాళులర్పిస్తోందని అన్నారు. ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని రీతిలో శిక్షిస్తామంటూ సంచలన వ్యాఖ్యల చేశారు. ఈ విషయంలో దేశ ప్రజలకు హామీ ఇస్తున్నా.. ప్రతీకారం తీర్చుకుని తీరుతామని అన్నారు. ఉగ్రవాదులకు అగ్రనేతలుగా చలామణి అవుతోన్న వారిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఫైర్ అయ్యారు. ఇది పర్యాటకులపై దాడి కాదు.. భారత్‌ (India)పై జరిగిన దాడిగానే భావిస్తామని అన్నారు. అదేవిధంగా టెర్రరిస్టులకు సాయం చేస్తున్న వారిని కూడా మట్టుబెడతామని అన్నారు. పహల్గాం ఉగ్రదాడిపై తమకు మద్దతుగా నిలిచిన ప్రపంచ దేశాల నాయకులకు, ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ కృతజ్ఞతలు తెలిపారు. ఇక బిహార్ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. బిహార్ రాష్ట్రంలోని మహిళల్లో ఆత్మవిశ్వాసం ఉందని కొనియాడారు. నిరుపేదలకు 3 కోట్ల ఇళ్లు కట్టించి ఇస్తామని అన్నారు. 14 లక్షల మందికి ఇళ్ల పట్టాల ఇచ్చామని గుర్తు చేశారు. పదేళ్లలో అధికంగా వైద్య కళాశాలలు నిర్మించామని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పేదలకు చాలా ఉపయోగం ఉంటుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు.



Next Story

Most Viewed