ఆర్టిఫిషియ‌ల్ ఇంటలిజెన్స్‌పై శిక్షణ

by Shyam |
ఆర్టిఫిషియ‌ల్ ఇంటలిజెన్స్‌పై శిక్షణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్టిఫిషియ‌ల్ ఇంటలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఇన్‌ప్లాంట్ ట్రైనింగ్‌ ఆండ్ ఇంటర్న్ షిప్ పేరుతో ఆర్టిఫిషియ‌ల్ ఇంటలిజెన్స్ పై అందించ‌నున్న శిక్షణ ఈనెల 12 నుంచి ప్రారంభమవుతున్నట్లు టీటా జాతీయ అధ్యక్షుడు సందీప్ మక్తాల తెలిపారు. శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ద‌ర‌ఖాస్తుల‌కు ఈనెల 10 చివరి తేదీ అని, ఈ శిక్షణ‌లో ఫేషియ‌ల్ రిక‌గ్నిష‌న్‌, చాట్ బాట్ ప్రాజెక్టులు చేయించడం జరుగుతుందని తెలిపారు. 2020 బ్యాచ్‌లో ఫేషియ‌ల్ రిక‌గ్నిష‌న్ ద్వారా అటెండెన్స్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్ట్ చేప‌ట్టారని, కొవిడ్ స‌మ‌యంలో ఏఐ ద్వారా అప్లికేష‌న్ రూపొందించి మాస్క్ ధ‌రించారా? అనేది గుర్తించారన్నారు. ఇలాంటి అంశాల‌తో పాటుగా ప్రస్తుత శిక్షణలో మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అంశాల‌ వ‌ర‌కు ఈ శిక్షణ ఉంటుందని, దీంతో పాటుగా ఒక ఇండ‌స్ట్రీ టూర్ సైతం ఉండ‌నుందన్నారు. 8 వారాల ఈ శిక్షణ‌లో ఉత్తీర్ణులైన వారికి అమెరికాలోని టాప్ 50 యూనివ‌ర్సిటీల‌లో ఒక‌టైన యూనివ‌ర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ డెల్లాస్ ద్వారా శిక్షణ ప‌త్రం అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ శిక్షణ‌ను సామాజిక ప్రయోజ‌నాల కోసం టీటా- డిజిథాన్ ద్వారా కేవ‌లం రూ. 10వేలకే అందించ‌నున్నట్లు పేర్కొన్నారు. bit.ly/digithon_academy లింక్ దరఖాస్తు చేసుకోవచ్చని, వివరాలకు 6300368705/8123123434/8712360354 సంప్రదించాలని కోరారు.

Advertisement

Next Story