ఖైరతాబాద్‌ గణపయ్యదగ్గరికి వెళ్తున్నారా.. ఇవి తెలుసుకోండి

by Hamsa |   ( Updated:2021-09-09 23:05:09.0  )
ఖైరతాబాద్‌ గణపయ్యదగ్గరికి వెళ్తున్నారా.. ఇవి తెలుసుకోండి
X

హైదరాబాద్‌: ఖైరతాబాద్‌లో పంచముఖ రుద్ర గణపతి కొలువుదీరాడు. ఈ గణపయ్యను చూడటానికి భక్తులు వేల సంఖ్యలో ఖైరతాబాద్‌కు చేరుకుంటారు. గత సంవత్సరం కరోనా కారణంగా పెద్ద ఎత్తున పండుగ జరుపుకోలేక పోయిన, ఈ సారి కాస్త కరోనా తగ్గుముఖం పట్టడంతో వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. దీంతో ఈ సారి భక్తులు పెద్ద సంఖ్యలో ఖైరతా‌బాద్‌కు తరలి వస్తున్నారు. ఈ క్రమంలో ఖైరతాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

గణేశ్‌ ఉత్సవాల దృష్ట్యా ఈనెల 19 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రకటించారు. అంతే కాకుండా ప్రజలు వీలైనంత వరకు తమ సొంత వాహనాల్లో కాకుండా మెట్రో లేదా పబ్లిక్ వాహనాల్లో రావాలిని పోలీసులు చూచిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే, ఖైర‌తాబాద్‌లో రాజీవ్‌గాంధీ విగ్రహం మీదుగా వెళ్లే వాహ‌నాల‌కు అనుమ‌తించ‌డంలేదు. లక్డీక‌పూల్‌లోని రాజ్‌దూత్ మీదుగా వ‌చ్చే వాహనాల‌ను మార్కెట్ వైపుకు మ‌ళ్లిస్తున్నారు. ఇక నెక్లెస్ రోడ్డు నుంచి వ‌చ్చే వాహ‌నాలకు ఐమాక్స్‌లో పార్కింగ్ సౌక‌ర్యం ఏర్పాటు చేశారు. భక్తుల కోసం హెచ్‌ఎండీఏ పార్కింగ్‌ స్థలంలో వాహనాల పార్కింగ్‌కు అనుమతిస్తున్నారు. వృద్ధులు, నడవలేనివారికి మింట్‌ కాంపౌండ్‌లో పార్కింగ్‌ చేసుకోవచ్చని తెలిపారు. ఖైరతాబాద్‌ ప్రధాన రహదారిలో బారికేడ్లను ఏర్పాటు చేశారు. భక్తులను మాత్రమే అనుమతిస్తున్నారు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed