- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కేసీఆర్ గడ్డమీద రేవంత్ గర్జన..
దిశ ప్రతినిధి, మెదక్ : తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని మోసం చేసిన దగుల్బాజీ, దగాకోరు కేసీఆర్ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. సీఎం ఇలాఖ గజ్వేల్ లో శుక్రవారం దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోర సభ ముగింపు సభ నిర్వహించారు. ఈ సభకు రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ఇంచార్జి మాణిక్యమ్ ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షలు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ వర్కింగ్ ప్రసిడెంట్స్ సమావేశానికి అధ్యక్షత వహించిన గీతారెడ్డి, అజారుద్దీన్, మహేష్ కుమార్ గౌడ్, ఎన్నికల నిర్వాహక చైర్మన్ దామోదర్ రాజా నర్సింహ, రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ షబ్బీర్ అలీ, మాజీ పీసీసీ అధ్యక్షులు వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య, ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, సంపత్ కుమార్, అజతుల హుసేన్, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, సీతక్క, పొడెం వీరయ్య, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, మల్లు రవి, హర్కర వేణుగోపాల్, బలరాం నాయక్, సిద్దిపేట డీసీసీ అధ్యక్షులు నర్సారెడ్డి, పొన్నం ప్రభాకర్, కుసుమ కుమార్, దళిత కాంగ్రెస్ చైర్మన్ ప్రీతమ్, ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్ జగన్ లాల్, అద్దంకి దయాకర్, అనుబంధ సంఘాల ఛైర్మన్ లు, డీసీసీ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సీఎంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దమ్ముంటే గజ్వేల్ కు రమ్మని టీఆర్ఎస్ నాయకులు సవాల్ విసిరారు. లక్ష మంది కాంగ్రెస్ సైనికులతో గజ్వెల్ కు వస్తా అని చెప్పినా.. కృష్ణ, గోదావరి నదులు ఒకసారి పారినట్టు ఉంది. జన సముద్రంతో గజ్వెల్ మునిగిపోయింది. ఆరు నెలల్లో మళ్లీ వస్తా అప్పుడు 5 లక్షల మందితో కదం తొక్కుతామన్నారు. తెలంగాణ విముక్తి కోసం దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, షాయబుల్లాఖాన్, తురేబాజ్ ఖాన్ లు లాంటి ఎంతో మంది పోరాట ఫలితం నేటి తెలంగాణ స్వాతంత్రం.. కానీ రాష్ట్రంలో ప్రజలకు స్వేచ్చలేదు, స్వయం పాలన కోసం నాడు రజాకార్లను తరిమికొట్టారు. ఇప్పుడు కుటుంబ పాలన నిర్వహిస్తున్న కేసీఆర్ కుటుంబాన్ని తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైంది. తెలంగాణ అంటే ఎంతో మంది పాఠాలు చెప్పిన భూమి.. ఎంతో మంది నియంతలను తరిమికొట్టింది. ఇందిరమ్మను మెదక్ ఎంపీ గా గెలిపించి ఢిల్లీకి ప్రధాన మంత్రిగా పంపిన ఘనత మెదక్ ప్రజలది. ఇందిరమ్మ ప్రధాని కావడం వల్ల ఇక్కడ 25 పెద్ద పరిశ్రమలు వచ్చాయి. దాని వల్ల ఎంతో అభివృద్ధి చెందాయి.
లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. 12 శాతం ఉన్న వాళ్లకు కేబినెట్ లో ఒక్క మంత్రి పదవి ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. కేసీఆర్ మనవడు తినే సన్న బియ్యం కూలి పిల్లలు తింటున్నారు అని కేసీఆర్ అంటున్నారు. మాకు కావాల్సింది.. సన్న బియ్యమో, చాప పిల్లల కోసమో, గొర్రె పుల్ల కోసమో కాదు. కేసీఆర్ మనవడు చదువుతున్న స్కూల్లో మా పిల్లలు చదవాలి. మా పిల్లలు ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు, జడ్జిలు కావాలె. కేసీఆర్ కు పంటి నొప్పి వస్తే యశోద ఆసుపత్రికి పోయి వైద్యం చేయించుకుంటాడు.. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పెట్టి కార్పొరేట్ వైద్యం పేదలకు అందిస్తే దాన్ని అమలు చేయడం లేదు. డ్రగ్స్ కేసు లో హాజరు అవుతున్న సెలెబ్రెటీస్ కి బ్రాండ్ అంబాడిసర్ కేటీఆర్ కాగా మద్యం అమ్మకాల్లో కేసీఆర్లు బ్రాండ్ అంబాసిడర్లుగా మారారు. రాష్ట్రంలో మద్యం ఆదాయం 300 శాతం పెరిగింది. మల్లన్న సాగర్ లో 60 వేలు ఎకరాలు భూమి తీసుకుని 14 గ్రామాలని ముంచారు. కొండ పోచమ్మ సాగర్ లో తమ బంధువులు భూమి కాపాడడం కోసం పేదలు భూమి ని లాక్కొన్నారు.
నిరుద్యోగుల కోసం ధర్మయుద్ధం ..
తెలంగాణ ఉద్యమంలో ఆత్మ బలిదానాలు చేసుకున్న 1200 మంది కుటుంబాలకు తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చింది. అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకొని డిసెంబర్ 9 వరుకు నిరుద్యోగులు కోసంధర్మ యుద్ధం చేస్తామని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. పరేడ్ గ్రౌండ్ లో నిరుద్యోగులు కోసం ధర్మ యుద్ధం చేస్తాం. 30 లక్షలు మందికి 33 నెలలుగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి బాకీ ఉన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక 4632 బడులు ను మూసి వేశారు. ముస్లిం లకు 12 శాతం ఇస్తానని చెప్పి ఏడున్నర ఏళ్ళు అయింది.. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని తుంగలో తొక్కారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని చెప్పి అడ్రస్ లేదు.
చైత్ర కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు ..
సింగరేణి చిన్నారి హత్య కేసులో ఏడు గంటలు పోలీసులు కేసు నమోదు చేయలేదు. కేటీఆర్ ఆ కుటుంబము దగ్గరకి ఎందుకు వెళ్ళలేదని ప్రశ్నించారు. ఏడూ లక్షలు కెమెరా లు ఉన్నాయని చెప్పుకునే డీజీపీ నేరస్తుడు ను ఎందుకు పట్టుకోలేకపోయరు. కేసీఆర్ చెప్పుకునే డీజీపీ నేరస్తుడును ఎందుకు పట్టుకోలేకపోయరు. కేసీఆర్ మానవ మృగంగా మారాడు. హుజురాబాద్ ఎన్నికల గురించి మాత్రం సమీక్షలు చేయడానికి మాత్రం కేసీఆర్ కి టైం ఉంది కాని చిన్నారి హత్య కేసులో నిందితుడు ని పట్టుకోవడం కోసం మాత్రం సమీక్ష చేయలేదు.
సోనియమ్మ రాజ్యంలోనే సామాజిక న్యాయం ..
రాబోయే 19 నెలలు తెలంగాణ భవిషత్తు ను డిసైడ్ చేయబోతోంది. సోనియమ్మ రాజ్యంతోనే సామాన్య, మధ్య తరగతి ప్రజలకు న్యాయం జరుగుతుంది. దళిత, గిరిజనులకు లక్ష కోట్లు అప్పు పడ్డాడు. కేసీఆర్ ఇల్లు అర్రజ్ పెట్టి ఆ డబ్బులు వసూలు చేస్తాం.. తెలంగాణ లో కేసీఆర్ కుటుంబ అరాచకాలు నుంచి తెలంగాణ ను కాపాడేందుకు తుది దశ ఉద్యమం చెయ్యాలి. ప్రతి పోలింగ్ బూత్ నుంచి 9 మంది కార్యకర్తలు 22 నెలలు ఇంటికి సెలవు పెట్టి పోరాటం చెయ్యాలి. సోనియమ్మ రాజ్యూనికి మీరే బ్రాండ్ అంబాసిడర్ లు .. రాబోయే రోజుల్లో మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చి రాజకీయంగా ఎంతో నష్టపోయిన తెలంగాణ కోసం ఎంతో మంది ఉద్యమం చేస్తే ఇప్పుడు ఎవడి పాలైంది. తెలంగాణ తెలంగాణలో ఉన్న యువత కళ్లు తెరిస్తే కేసీఆర్ మాది ముసై పోతారంటూ రేవంత్ రెడ్డి విమర్శించారు. అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ రూపొందించిన పీపుల్స్ చార్టీ షీటు రాజ్యసభ ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గో ఆవిష్కరించారు. డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ చార్టీ షీట్ లోని అంశాలను చదివి వినిపించారు.