పరువు దక్కాలంటే.. గెలవాల్సిందే!

by Anukaran |   ( Updated:2020-12-01 20:53:41.0  )
పరువు దక్కాలంటే.. గెలవాల్సిందే!
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌లో ఊపు చూపించిన భారత క్రికెటర్లు ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డేల్లో వరుసగా విఫలం అవుతున్నారు. బ్యాటింగ్ విభాగం కాస్త.. మెరుగ్గా కనిపించినా, బౌలర్లు పూర్తిగా విఫలం చెందుతున్నారు. వరుస రెండు వన్డేల్లో ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడిన టీమిండియా, నేడు వన్డేలో ఎలాగైనా గెలిచి పరువు కాపాడుకోవాలని చూస్తోంది. ఇప్పటికే సరీస్ చేజారినా, కనీసం వైట్‌వాష్ నుంచైనా తప్పించుకోవాలని చూస్తోంది. ఇప్పటికే వరుస విజయాలతో మంచి ఊపుమీదున్న ఆస్ట్రేలియా టీమిండియాన వైట్‌వాష్ చేయాలన్న ఆలోచనలో ఉంది.

ఆ జోరు కొనసాగించడానికి కచ్చితంగా ప్రయత్నిస్తుంది. అయితే ఇప్పటికే ఓపెనర్ వార్నర్ గాయం కారణంగా చివరి వన్డే మ్యాచ్‌కు దూరం కావడం భారత జట్టుకు కలిసొస్తుంది. వార్నర్ స్థానంలో డార్సీ షార్ట్ టీంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. టీమిండియాలో గత రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన బౌలర్లలో ఈ మ్యాచ్‌లో మార్పులు చేసే అవకాశం ఉంది. ఫాస్ట్ బౌలర్ సైని, స్పిన్నర్ చాహల్‌ను పక్కన పెట్టనున్నట్టు సమాచారం. అలాగే ఐపీఎల్‌లో సన్ రైజర్స్ తరపున అద్భుతంగా రాణించిన నటరాజన్‌ను టీంలోకి తీసుకురావాలని ఒత్తిడి పెరుగుతోంది. షమి ఒక మ్యాచ్‌లో ఆకట్టుకున్నా మరో దాంట్లో చేతులెత్తేశాడు. ఓడిన గత మ్యాచ్‌ల నుంచి తేరుకొని కంగారుల ఎదుట భారీ లక్ష్యాన్ని నిలపాలంటే కచ్చితంగా జట్టు సభ్యులందరూ సమర్ధవంతంగా రాణించాలని క్రీడాభిమానులు కోరుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed