- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పోలీసుల అత్యుత్సాహం.. టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి నేతలపై రేప్ కేస్
దిశ,వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సీఎం జగన్ ఇంటి ముట్టడికి యత్నించిన విద్యార్థి నేతలపై అత్యాచారయత్నంకేసు పెట్టడం కలకలం రేపుతోంది. సమస్యల్ని పరిష్కరించాలంటూ టీఎన్‌ఎస్‌ఎఫ్ నేతలు సీఎం ఇంటి ముట్టడికి ప్రయత్నించాదు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అత్యాచార యత్నం కేసు నమోదు చేశారు. అనంతరం శనివారం కోర్ట్ లో హాజరుపరిచారు. అయితే వారిపై అత్యాచారం యత్నం కేసులు నమోదు చేయడంతో న్యాయమూర్తి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీంతో మరో కేసుకు సంబంధించిన మ్యాటర్ రిమాండ్ రిపోర్ట్ లో పేస్ట్ అయ్యిందని పోలీసులు వివరణిచ్చారు. సెక్షన్లు మార్చి తీసుకొస్తామంటూ నిందితుల్ని స్టేషన్ కు తీసుకెళ్లారు పోలీసులు. అయితే పోలీసుల తీరుపై విద్యార్ధి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారుల విధులకు భంగం కలిగించకుండా శాంతియుతంగా నిరసన చేస్తున్న తమని పోలీసులు అదుపులోకి తీసుకోవడం దారుణమన్నారు.