బీజేపీ కార్యకర్తల చేతితో టీఎంసీ నేత దారుణ హత్య..

by Shamantha N |
బీజేపీ కార్యకర్తల చేతితో టీఎంసీ నేత దారుణ హత్య..
X

దిశ, వెబ్ డెస్క్ : అసెంబ్లీ ఎన్నికల సమయం గడుస్తున్న కొద్దీ బెంగాల్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. తాజాగా బెంగాల్‌లోని నెట్యూరా బస్టాండ్ ప్రాంతంలో ఆదివారం రాత్రి టీఎంసీ నేత దుర్గా సోరెన్‌పై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. దీంతో సోరేన్ అపస్మారక స్థితిలో వెళ్లిపోగా.. విషయం తెలుసుకున్న టీఎంసీ కార్యకర్తలు అతడిని వెంటనే జార్గ్రామ్ ఆసుపత్రికి తరలించారు.

అయితే చికిత్స పొందుతూ సోరేన్ ఈరోజు ఉదయం మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. సోరేన్ మృతి చెందడంతో టీఎంసీ నేతలు, కార్యకర్తలు ఆసుపత్రికి వద్దకు చేరుకుని బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేయాలని నిరనసకు దిగారు. దీంతో జార్గ్రామ్ ఆసుపత్రి ప్రాంతంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

Advertisement

Next Story