చంపేస్తారని.. విగ్రహాలు చేయించుకున్నఎమ్మెల్యే

by Shamantha N |   ( Updated:2020-03-14 01:19:52.0  )
చంపేస్తారని.. విగ్రహాలు చేయించుకున్నఎమ్మెల్యే
X

పశ్చిమ బెంగాల్‌లో తృణముల్ కాంగ్రెస్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే బతికుండాగానే తన విగ్రహాలను తయారు చేయించుకున్నాడు. ప్రత్యర్థులు తనను చంపేస్తే.. ప్రజలు తనను మరిచిపోకుండా ఉండడానికి తన విగ్రహాలను తయారు చేయించుకొని ఇంట్లో పెట్టుకున్నారు ఎమ్మెల్యే జయంత్ నాస్కర్.

ఇటీవల సదరు ఎమ్మెల్యే నివాసంలో కార్యకర్తల సమావేశం జరిగింది. ఇంట్లో ఉన్న విగ్రహాలను చూసి వారు షాక్‌కు గురయ్యారు. ఆ విగ్రహాలను ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఇటీవల అలీపూర్ జైలు నుంచి నలుగురు నేరస్తులు పారిపోయారని, వారికి స్థానిక నేతలు తనను చంపడానికి సుపారీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే ఆరోపించారు. ఒకవేళ తాను చనిపోతే ఈ విగ్రహాలను ఎక్కడ పెట్టాలన్న విషయం ప్రజలే నిర్ణయిస్తారన్నారు.

tag; tmc mla, statues, national news, viral

Next Story

Most Viewed