- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
త్వరలోనే తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి రైళ్ల పునరుద్ధరణ..
దిశ, వెబ్‌డెస్క్ : త్వరలోనే తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి రైలు సర్వీసులు తిరిగి అందుబాటులోకి రానున్నాయి. అత్యంత బిజీగా ఉండే తిరుపతిలో రైల్వే స్టేషన్‌లో ఇన్ని రోజులు పునర్నిర్మాణ పనులు జరగుతుండటంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తాజాగా రీ మోడలింగ్ వర్క్స్ చివరిదశకు చేరుకోవడంతో మార్చి 12 నుంచి తిరిగి అన్ని రైళ్లు రాకపోకలు సాగిస్తాయని దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సీహెచ్ రాకేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
2013-14 సంవత్సరానికి గాను రూ.77.29కోట్లతో తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఇందులో రేణిగుంట నుంచి ఇంజిన్ మార్చుకునేందుకు వీలుగా కొత్త లైన్ వేశారు. అంతేకాకుండా, సులువుగా రైళ్లు ప్రయాణించేందుకు 640 మీటర్ల కొత్త ట్రాక్ నిర్మాణం, ట్రైన్ సేఫ్టీ, ఇంటర్ లాకింగ్ చేంజ్ కోసం కొత్త వ్యవస్థను తీర్చిదిద్దారు. కొత్తగా చేపట్టిన పునర్నిర్మాణ పనుల వలన రైళ్ల రాకపోకలకు ఇబ్బంది ఉండదు. ఎన్ని రైళ్లు అయినా సులువుగా ప్రయాణం సాగించవచ్చని తెలుస్తోంది. దీంతో ట్రైన్స్ నిర్దేశిత సమయానికే గమ్యానికి రీచ్ అవుతాయని సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం గజానన్ మాల్యా వెల్లడించారు. నిర్దేశించిన గడువులోపు పనులు పూర్తి చేసిన గుంతకల్ డివిజన్ సిబ్బందికి గజానన్ మాల్యా అభినందనలు తెలిపారు.