- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
భూభారతి చట్టంతో రైతు సమస్యలు పరిష్కారం : నెల్లికంటి సత్యం

దిశ,చౌటుప్పల్ : రైతుల సమస్యలను పరిష్కరించే విధంగా భూభారతి చట్టం పనిచేయాలని శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యం సూచించారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యం హాజరై మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటం నుండి భూమికోసం తెలంగాణలో ఎన్నో ఉద్యమాలు నిర్వహించారని కానీ నేటికీ భూ సమస్యలు తీరలేదని అన్నారు. ధరణి చట్టంలో అనుభవదారుకాలం తీసివేయడం తో గతంలో అమ్ముకున్నా రైతుల పేరుపై తిరిగి భూమి రావడంతో వారు ఇతరులకు అమ్ముకొని గ్రామాలలో భూ సమస్యలను సృష్టించారని అన్నారు. భూభారతి చట్టంలో తిరిగి అనుభవదారు కాలాన్ని ప్రవేశపెట్టడం శుభపరిణామం అన్నారు.
గతంలో ధరణిలో ఒక సర్వే నెంబర్ లోని కొంత భూమిలో సమస్యలు ఉంటే ఆ సర్వే నెంబర్ లోని పూర్తి విస్తీర్ణాన్ని బ్లాక్ చేయడం జరిగిందని, దీంతో సామాన్య రైతులు తమ అవసరాలకు భూమిని అమ్ముకోకుండా ఉండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని అన్నారు. ఇలాంటి సమస్యలు భూభారతిలో పునరావృత్తం కాకుండా అధికారులు పనిచేయాలని సూచించారు. భూభారతి చట్టం అమలులో అధికారుల పాత్ర ముఖ్యమైనదని అందుకు అనుగుణంగా అధికారులు అంతా పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని తీసివేస్తామని చెప్పి ఇచ్చిన హామీ ప్రకారం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చారని అన్నారు. చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం ప్రాంతంలోని గిరిజనుల పోడు భూముల సమస్యలను కూడా భూభారతి చట్టంతో పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అప్పీల్ వ్యవస్థ లేకుండా ధరణి నిరంకుశ చట్టంగా మార్చారని ల్,భూభారతిలో అప్పీల్ వ్యవస్థ రావడం రైతులు సంతోషించదగ్గ విషయం అన్నారు. రాష్ట్రంలో సర్వేయర్ల కొరత తీవ్రంగా ఉందని వెంటనే సర్వేయర్లను నియమించి రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
రైతుల చుట్టం భూభారతి చట్టం : యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ వి. హనుమంతరావు.
భూభారతి చట్టం రైతుల చుట్టంగా మారానుందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ వి. హనుమంతరావు అన్నారు. 23 సెక్షన్స్ 19 రూల్స్ తో అతి చిన్న చట్టంగా భూ భారతి చట్టం రూపొందించబడిందని తెలిపారు. మండలాల వారీగా రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి చట్టంపై అవగాహన వచ్చేలా చేస్తామన్నారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో భూ భారతి చట్టంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా కలెక్టర్ హాజరై మాట్లాడారు.గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి రూపాయి ఖర్చు లేకుండా భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. ప్రయోగాత్మకంగా కొన్ని మండలాల్లో భూ భారతి చట్టం అమలు పరిచి చట్టంలో ఇంకా ఏమైనా లోపాలు ఉన్నా సవరిస్తామని చెప్పారు. ధరణిలో అప్పీలు వ్యవస్థ లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని భూ భారతిలో సెక్షన్ 15 లో అప్పీలు వ్యవస్థ ఉందని దీంతో కింది స్థాయిలో అన్యాయం జరిగితే ఉన్నతాధికారులకు అప్పీలు చేయవచ్చని తెలిపారు.
రైతులు తమ భూ సమస్యలు ఉంటే సంవత్సరం లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. త్వరలో లైసెన్స్ సర్వేయర్ లను నియమించి భూ రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాపును పాసుబుక్ పై వచ్చేలా ముద్రిస్తామని అన్నారు. మే 1 నుంచి నియోజకవర్గానికి ఒక మండలాన్ని ఎంపిక చేసి భూ భారతి ద్వారా రెవెన్యూ సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. సెక్షన్ 6 ద్వారా సాదాభై నామాలకు పరిష్కారం లభించునుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా జాయింట్ కలెక్టర్ వీరారెడ్డి,చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్ రెడ్డి, తహసిల్దార్ హరికృష్ణ, చౌటుప్పల్ ఏఎంసీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి నాగరాజు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు పాల్గొన్నారు.