- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇచ్చిన హామీని జగన్ నిలబెట్టుకున్నారు : రమణ దీక్షితులు
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల వేళ తమకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని తిరుమల ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో బలవంతంగా తమతో పదవీ విరమణ చేయించారని దీక్షితులు గుర్తుచేశారు. పదవీ విరమణ పొందిన అర్చుకులు విధుల్లో చేరాలనే ప్రభుత్వ ఉత్తర్వులపై హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. అర్చక వ్యవస్థకు సీఎం జగన్ ప్రాణం పోశారని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇప్పటికే పనిచేస్తున్న అర్చకుల విషయాన్ని టీటీడీ చూసుకుంటుందని వివరించారు. అయితే, అర్చకులకు పదవీ విరమణ ఉండే అంశాన్ని రమణ దీక్షితులు వ్యతిరేకించారు.
ఇదే అంశాన్ని సీఎం జగన్‌కు వివరించగా, ఆయన దీనితో ఏకీభవించారని చెప్పుకొచ్చారు. ఇదిలాఉండగా, తిరుపతి ఉపఎన్నిక సందర్భంగా పదవీ విరమణ పొందిన అర్చకులను తిరిగి విధుల్లో చేరవచ్చని ప్రభుత్వ ఇచ్చిన ఉత్తర్వులను బీజేపీ తప్పుబడుతోంది. ఎన్నికల వేళ వైసీపీ అర్చక సంఘాలను తప్పుదారి పట్టిస్తోందని, ఓట్ల కోసమే సీఎం జగన్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవ్వగా అప్పుడే ఈ నిర్ణయాన్ని ఎందుకు ప్రకటించలేదని, ఉపఎన్నిక వేళ ఎందుకు ప్రకటించారని బీజేపీ-జనసేన కూటమి అధికార పార్టీపై మండిపడుతోంది.