- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
టైమ్స్ గ్రూప్ ఛైర్ పర్సన్ ఇందూజైన్ ఇకలేరు..

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. తాజాగా ఈ కరోనా కాటుకు టైమ్స్ గ్రూప్ చైర్‌పర్సన్ ఇందూ జైన్ బలయ్యారు. దేశంలో అతి పెద్ద మీడియా గ్రూపు అయిన టైమ్స్ ఆఫ్ ఇండియా చైర్‌పర్సన్ ఇందూ జైన్ (84) గత కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం దేశ రాజధాని ఢిల్లీలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె గురువారం తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీతో పాటు.. పలువురు రాజకీయ.. మీడియా.. పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా స్పందించారు. తమ సంతాపాన్ని తెలియజేశారు. ఇకపోతే ఇందూ జైన్ టైమ్స్ ఫౌండేషన్ ను ఏర్పాటు చేసి, దాని ఎదుగుదలలో ఆమె కీలకంగా వ్యవహరించారు. 2000లో టైమ్స్ ఫౌండేషన్‌ను స్థాపించి సేవా కార్యక్రమాల్లో దేశంలోనే ఉత్తమ ఎన్‌జీవోగా తీర్చిదిద్దారు. టైమ్స్ గ్రూప్ ఛైర్ పర్సన్ ఇందూజైన్ అకస్మాత్తుగా మరణించటం బాధాకరమని మీడియా ప్రతినిధులు తెలుపుతున్నారు.