శ్వాస తీసుకోకుండానే బతికే జంతువు.. ఎక్కడుందో తెలిస్తే షాక్ అవొచ్చు..

by Sujitha Rachapalli |
శ్వాస తీసుకోకుండానే బతికే జంతువు.. ఎక్కడుందో తెలిస్తే షాక్ అవొచ్చు..
X

దిశ, ఫీచర్స్ : భూమి మీద జీవించే ప్రతి జీవి శ్వాస తీసుకుని బతుకుతుంది. ఒకవేళ శ్వాస తీసుకోలేదంటే చనిపోయిందనే అర్థం. కానీ కొత్తగా శాస్త్రవేత్తలు శ్వాస తీసుకోకుండానే బతుకుతున్న జీవిని గుర్తించారు. అవును... హెన్నెగుయా సాల్మినికోలా అనే చిన్న పరాన్నజీవి.. సాల్మన్ చేప కండరాల్లో కనిపించింది. ఇది శ్వాస తీసుకోని మొదటి జంతువుగా శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది. సాధారణంగా జంతువులకు మైటోకాండ్రియా అనే కణ భాగం ఆక్సిజన్‌ను శక్తిగా మార్చడానికి అవసరం. కానీ ఈ జీవికి అలాంటి మైటోకాండ్రియా లేదు. ఆక్సిజన్ లేకుండానే చేప కణాల నుంచి నేరుగా పోషకాలు, శక్తిని తీసుకుని బతుకుతుంది. ఈ ప్రత్యేకత దాని పరాన్నజీవి జీవనానికి అనుగుణంగా ఏర్పడిన పరిణామం వల్ల వచ్చిందంటున్న శాస్త్రవేత్తలు.. తక్కువ ఆక్సిజన్ ఉన్న చోట కూడా ఇది సంతోషంగా జీవిస్తుందని చెప్తున్నారు.

ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం.. జంతువులంటే ఆక్సిజన్‌తో శ్వాసించేవే అనే సాంప్రదాయ ఆలోచనను సవాలు చేస్తుంది. ఈ జీవి శక్తిని పొందే ప్రత్యేక మార్గం.. జీవం ఎంత వైవిధ్యంగా కష్టమైన పరిస్థితులకు అనుగుణంగా మారుతుందో చూపిస్తుంది. పరాన్నజీవుల పరిణామం గురించి కొత్త ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఈ చిన్న జీవి ఆక్సిజన్ లేకుండా బతకడమే కాదు బాగా వృద్ధి కూడా చెందుతుండగా.. జీవులు సవాళ్లను ఎదుర్కొనే విభిన్న మార్గాలు ఎలా ఉంటున్నాయో స్పష్టం చేస్తుంది.



Next Story

Most Viewed