వరద సహాయం అందడం లేదని రాస్తారోకో

by Shyam |
వరద సహాయం అందడం లేదని రాస్తారోకో
X

దిశ, ముషీరాబాద్:
వరద సహాయం కింద ప్రభుత్వం అందిస్తున్న పదివేల రూపాయలు తమకు రాలేదని నల్లకుంట డివిజన్ తిలక్ నగర్ బస్తీవాసులు శనివారం రాస్తారోకోకు దిగారు. నల్లకుంట కార్పొరేటర్ గరిగంటి శ్రీదేవి రమేశ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బస్తీవాసులు అంతా ఒక్కసారిగా వచ్చి రోడ్డుపై బైఠాయించడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ… ఇటీవల కురిసిన వర్షాలతో వరద నీరు ఇళ్లలోకి చేరి తీవ్రంగా నష్టపోయామని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే వరద సహాయం తమకు అందకుండా ధనికులకు, ఇంటి ఓనర్లకు, పార్టీ కార్యకర్తలకు ఇస్తున్నారని వారు ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చే సహాయం బాధితులకు ఇవ్వకుండా దారి మళ్ళించడం ఎంత వరకు సమంజసమని వారు ప్రశ్నించారు. నిజమైన బాధితులను పట్టించుకోని జీహెచ్ఎంసీ అధికారుల పైన, నాయకుల పైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Advertisement

Next Story