- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నేటి నుంచి దేశవ్యాప్తంగా టీకా ఉత్సవ్ ప్రారంభం..
by Shamantha N |

X
దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో.. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసే దిశగా ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా టీకా ఉత్సవ్ కార్యక్రమం ప్రారంభం కానుంది. దేశంలో ఈరోజు నుంచి నాలుగురోజులపాటు ఈ ఉత్సవం కొనసాగనుంది. దీనిలో భాగంగా అర్హులైన వారిలో ఎక్కువ మందికి టీకా అందిస్తారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రధాని మోడీ.. ఈనెల 8వ తేదీన అన్ని రాష్ట్రాల సీఎంలతో వర్చువల్‌గా సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సమావేశంలోనే ప్రధాని.. టీకా పంపిణీని వేగంగా అందించేందుకు ఈరోజు నుంచి 14వ తేదీ వరకు టీకా ఉత్సవ్ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశించారు. దీంతో అన్ని రాష్ట్రాలు నేటి నుంచి టీకా ఉత్సవ్ కార్యక్రమాన్ని చేపట్టనున్నాయి.
Next Story