గురువారం పంచాంగం, రాశి ఫలాలు (03-06-2021)

by Hamsa |
గురువారం పంచాంగం, రాశి ఫలాలు (03-06-2021)
X

సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : వైశాఖమాసం
ఋతువు : వసంత ఋతువు
కాలము : వేసవికాలం
వారము : గురువారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : నవమి
(ఈరోజు తెల్లవారుజాము 1 గం॥ 17 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 2 గం॥ 24 ని॥ వరకు)
నక్షత్రం : పూర్వాభద్ర
(నిన్న సాయంత్రం 5 గం॥ 6 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 6 గం॥ 39 ని॥ వరకు)
యోగము : ప్రీతి
కరణం : తైతిల
వర్జ్యం : (నిన్న రాత్రి 11 గం॥ 54 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 1 గం॥ 36 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు ఉదయం 10 గం॥ 8 ని॥ నుంచి ఈరోజు ఉదయం 11 గం॥ 50 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 10 గం॥ 2 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 54 ని॥ వరకు)(ఈరోజు సాయంత్రం 3 గం॥ 17 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 9 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 51 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 29 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 8 గం॥ 56 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 34 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 12 గం॥ 13 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 51 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 40 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 47 ని॥ లకు
సూర్యరాశి : వృషభము
చంద్రరాశి : కుంభము

రాశి ఫలాలు..

మేష రాశి.. వ్యవహారాలలో విజయం. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఈ కరోనా సమయంలో బయట భోజనం కన్నా ఇంటి భోజనం మిన్న. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు ఉద్యోగంలో మనసు లగ్నం పెట్టి పనులు పూర్తి చేయండి. హడావిడిలో తప్పులు జరిగితే పై అధికారుల తో మాటలు. చేతికి కావల్సినంత సొమ్ము అందుతుంది. అవసరాలకు ఖర్చు చేస్తారు పొదుపు చేస్తారు. ఈ రాశి స్త్రీలకు ఈరోజు ఇంటిని మీకు నచ్చిన విధంగా అలంకరించుకుంటారు.

వృషభ రాశి.. నూతన స్నేహితులను పెంచుకుంటారు. పూర్తి ఆనందకరమైన రోజు. ఆఫీసులో మీ సామర్థ్యాలను అందరూ ప్రశంసిస్తారు. ఉద్యోగంలో మంచి పురోగతి ఉంటుంది. కొంతమందికి ప్రమోషన్ అవకాశం. కుటుంబంలోని వ్యక్తులు మనసు విప్పి మాట్లాడు కొనటం వలన ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది. ఈ రాశి స్త్రీలకు తమ ఆరోగ్యాన్ని పూర్తిగా మెరుగుపరచుకుంటారు.

మిధున రాశి.. ఈ కరోనా సమయంలో లేనిపోని భయాందోళనలు మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఆఫీసులో మిమ్ములను చెడ్డ చేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి జాగ్రత్త వహించండి. ఇల్లు కొనుగోలు లేక కట్టడానికి సంబంధించిన ప్రయత్నాలు సఫలమౌతాయి. వ్యాపారం లో నూతన పెట్టుబడులకు సంబంధించిన అన్ని విషయాలు ముందే తెలుసుకోండి. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఆనందకరమైన రోజు.

కర్కాటక రాశి.. నెగటివ్ థాట్స్ వదిలేయండి. లేకపోతే ఏ ప్రయత్నము ముందుకు సాగదు. ఆర్థిక పరమైన విషయాలు మెరుగుపడతాయి కుటుంబం గురించి మీరు పడుతున్న శ్రమ ను అందరూ ఒప్పుకుంటారు. ఆఫీసులో పనులను సరైన ప్రణాళిక వేసుకొని పూర్తి చేయండి. కళా రంగంలోని వారికి సరైన అవకాశాలు.ఈ రాశి స్త్రీలకు అధిక శ్రమ వలన కంటి నొప్పి మరియు పంటి నొప్పి వచ్చే అవకాశం ఉంది.

సింహరాశి.. మిత్రులతో బంధువులతో ఆనందంగా గడుపుతారు. వివాహం కాని వారికి సంబంధాలు కుదిరే అవకాశం. ఒక స్థిరాస్తి వ్యవహారం మీకు అనుకూలంగా పూర్తవుతుంది. ఉద్యోగస్తులకు వారికి రావలసిన బకాయిల గురించి శుభవార్త. ఆఫీసులో మీకు అప్పగించిన పనులను పూర్తి చేస్తారు. కావాల్సినంత ధనం చేతికందుతుంది. అవసరాలకు ఖర్చు పెడతారు పొదుపు చేస్తారు. ఫిట్ నెస్ కొరకు చేస్తున్న ప్రయత్నాల వలన శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ వ్యాపారానికి సంబంధించిన రహస్యాలను ఎవ్వరితోటీ చెప్పకండి. ఈ రాశి స్త్రీలకు మీ హుందా తనము వ్యక్తిత్వం వలన కొత్త స్నేహితులు పరిచయం అవుతారు.

కన్యారాశి.. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. శారీరక మానసిక ఆరోగ్యం కోసం యోగా మెడిటేషన్ చేయండి. డబ్బు పెట్టుబడి విషయంలో ఆ పథకాల గురించి ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. సామాజిక కార్యక్రమాలలో ప్రముఖులతో పరిచయాలు. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు ఉద్యోగంలో మీ సిన్సియారిటీ అందరి ప్రశంసలు పొందుతుంది. ఆదాయం పెంచుకోవడానికే నూతన మార్గాలను వెతుకుతారు ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

తులారాశి.. పనులు సకాలంలో పూర్తి కావాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. లేకుంటే మీ పలుకుబడి దెబ్బతింటుంది. కుటుంబంలోని వ్యక్తులు దుబారా అనవసరపు ఖర్చులను చేయటం వలన మీకు అశాంతి. అధిక శ్రమ వలన అనారోగ్య సూచనలు. వేళకు భోజనం ఫిట్ నెస్ ప్రయత్నాలు చేయండి. రుణాల కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటిలోని పెద్దల సలహాలను పాటించడం మరియు కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం ఎంతో మంచిది. టీవీ మరియు మొబైల్ అతి వాడకం వలన సమయం వృధా. ఈ రాశి స్త్రీలకు మీ భర్తతో మీ మనసులోని మాటను స్పష్టంగా చెప్పండి మీ ప్రయత్నాలు ఫలిస్తాయి

ధనస్సు రాశి.. అన్నివిధాలా అనుకూలమైన రోజు. ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం ఇవే మీ ఆయుధాలు. మీ అన్ని ప్రయత్నాలలో వీటిని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. సరి అయిన భోజనం మీ ఆరోగ్యానికి రక్ష. ఆఫీసులో పనులు అనుకూలంగా సాగాలంటే మీ పూర్తి శక్తి సామర్థ్యాలను వినియోగించ వలసి ఉంటుంది. ఆదాయానికి మించిన ఖర్చులు ఉండొచ్చు. వ్యాపారంలో నూతన పెట్టుబడులు అనుకున్నంత లాభాలను ఇవ్వకపోవచ్చు. కుటుంబంలోని వ్యక్తులతో పరుషంగా మాట్లాడకండి అవి బంధాలను పాడుచేస్తాయి. ఈ రాశి స్త్రీలకు మీ కుటుంబ విషయాలలో బంధువుల ప్రమేయం మీకు చికాకనిపిస్తుంది.

వృశ్చిక రాశి.. ఆదాయం బాగున్నా అనవసరపు దుబారా ఖర్చులు చేయకండి. నిదానంగా ఆలోచించి పనులు పూర్తి చేయండి. కంటి సమస్యలు చికాకు పెట్టవచ్చు. దీనివలన ఆఫీసులో ఏం పని చేస్తున్నారో మీకే తెలియకుండా పోతుంది. స్థిరాస్తి కొనుగోలు విషయంలో మీ నిస్పృహ మంచి అవకాశాలను దూరం చేయవచ్చు. వ్యాపారంలో మీ పోటీదారులను అధిగమిస్తారు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీతో మనసు విప్పి మాట్లాడటం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.

మకర రాశి.. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొల్పటానికి ప్రయత్నాలు చేస్తారు. మీ పిల్లల ప్రగతి మరియు వారితో గడపటం మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. వివాహం కాని వారికి సంబంధాలు వస్తాయి. ఫిట్ నెస్ కొరకు నూతన ప్రయత్నాలు చేస్తారు. ఆఫీసులో పనుల మీద లగ్నం పెట్టి పూర్తి చేయండి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మిమ్ములను మెప్పించడానికి చేసే ప్రయత్నాలు మీకు సంతోషాన్ని ఇస్తాయి.

కుంభరాశి.. కొన్ని పనులు గందరగోళ పరుస్తాయి. సహనంతో ఉంటూ ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేయండి. మెడిటేషన్ ఒక మంచి మార్గం. ఉద్యోగంలో అవసరం అయితే అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. వ్యాపారస్తులు వ్యాపారంలో సర్దుబాటు కొరకు రుణాలు చేయవలసిన పరిస్థితి కుటుంబంలో ఒకరి అవసరాలను ఒకరు గమనించు కొనటం వలన ఆహ్లాదకర వాతావరణం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఈ రాశి స్త్రీలకు అధిక శ్రమ వలన కాళ్ల నొప్పులు, ఒత్తిడి.

మీన రాశి.. పాజిటివ్ థాట్స్ వలన భవిష్యత్తు ఆశాజనకం. భయ ఆందోళనల వలన సరిగ్గా ఆలోచించలేరు. మీ ఆత్మవిశ్వాసం మీకు సరైన దారిని చూపిస్తుంది. వ్యాపారం లో లాభాలు మీకు ఎంతో ఉత్తేజాన్ని ఇస్తాయి. ఉద్యోగంలో సీనియర్స్ మరియు సహ ఉద్యోగుల తోడ్పాటుతో పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో మనసువిప్పి మాట్లాడండి. కళా రంగంలోని వారికి సరైన అవకాశాలు. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

Advertisement

Next Story