- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
దుండగుల దుశ్చర్య.. సర్పంచ్ అభ్యర్థి బైక్‌లు దహనం
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో దుండగులు రెచ్చిపోయారు. నందిగామ మండలం కంచెల గ్రామంలో టీడీపీ సర్పంచ్ అభ్యర్థి వెంకటలక్ష్మికి చెందిన రెండు బైక్‌లకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించి పరారయ్యారు. పెద్దమంటలు, శబ్ధ రావడంతో బయటకు దంపతులకు బైక్‌లు కాలిపోతూ కన్పించాయి. వెంటనే మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసినా అప్పటికే బైక్‌లు దగ్దం అయిపోయాయి. రాత్రి 2గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిన్న రాత్రి ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం బైక్‌లను ఇంటిముందు పార్క్‌చేసి నిద్ర పోయారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎన్నికల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు దుశ్చర్యకు పాల్పడటంతో గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది
Next Story