నాలుగేళ్ల చిన్నారిపై దుండగుల కాల్పులు

by Sumithra |
firing in america
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున న్యూయార్క్ నగరంలో గుర్తు తెలియని వ్యక్తుల జరిపిన కాల్పుల్లో నాలుగేళ్ల చిన్నారికి తీవ్రగాయాలు అయ్యాయి. అనంతరం మరో ఇద్దరు మహిళలపైనా కాల్పులు జరిపారు. మహిళలకు గాయాలు కాగా, చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. అమెరికాలో వరుసగా కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటుండడం కలకలం సృష్టిస్తోంది. కాల్పులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story