శంకుస్థాపన చేసి మూడేళ్లు దాటింది.. ఇకనైన పట్టించుకోండి

by Shyam |   ( Updated:2021-08-31 08:41:06.0  )
foundaton
X

దిశ,కొత్తూరు: ఆ రోడ్డుకు దాదాపు మూడు సంవత్సరాల క్రితం శంకుస్థాపన చేసారు. కానీ నేటికీ తట్టెడు మట్టి కూడా పోయలేదని మేమేం ఏం పాపం చేశామని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వివరాలు, షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండల కేంద్రంలోని అయ్యప్పటెంపుల్ నుంచి జంగోనిగూడకు వెళ్లే దారికి 2018లోనే శంకుస్థాపన చేశారు.

అయినప్పటికి ఎందుకో రోడ్డుమాత్రం వేయలేదు. వర్షాకాలం వచ్చిందంటే రోడ్డు గుంతలమయంగా మారి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 4,5 రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్డు బురదమయంగా మారింది. అసలే పారిశ్రామికవాడ కావడంతో నిత్యం వందలాది మంది ప్రయాణం చేస్తుంటారు. అయిన నాయకులు, అధికారులు పట్టించుకోవడం లేదు.కనీసం గుంతలలో మట్టి పోసి తాత్కాలిక మరమ్మతులు చేపట్టి తమ ఇబ్బంది తీర్చాలని వాహనదారులు కోరుతున్నారు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed