ముగ్గురు టెర్రరిస్టులు హతం.. కానీ, మన సైనికులు?

by Anukaran |   ( Updated:2020-11-08 06:45:35.0  )
ముగ్గురు టెర్రరిస్టులు హతం.. కానీ, మన సైనికులు?
X

దిశ, వెబ్‌డెస్క్: భారత సరిహద్దులో కాల్పులు మరోసారి కలకలం రేపాయి. జమ్ముకశ్మీ ర్‌లోని మచిల్ సెక్టార్‌లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదరురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో కెప్టెన్ సుదీప్ సర్కార్ సహా ముగ్గురు భారత సైనికులు వీర మరణం పొందారు. మరో ముగ్గురు ఉగ్రవాదులు ఇండియన్ ఆర్మీ చేతిలో హతం అయ్యారు. ఈ నేపథ్యంలోనే భద్రతాదళాలు-ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఉగ్రవాదులను హతమార్చిన సైనికులు ఘటనా స్థలం నుంచి తుపాకులు, భారీగా పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మిగతా టెర్రరిస్టుల కోసం మచిల్ సెక్టార్‌లో గాలింపు చర్యలు చేస్తున్నారు.

Advertisement

Next Story